Pahalgam Attack Janasena Flag.. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, జన సేన పార్టీ తమ జెండాని అవనతం చేయాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.
దాదాపు 30 మంది ప్రాణాల్ని బలిగొన్నారు తీవ్రవాదులు పెహల్గామ్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో. ఈ ఘటనలో మృతి చెందినవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారూ వున్నారు.
Pahalgam Attack Janasena Flag.. తెలుగు రాష్ట్రాల్లో.. జన సేన పార్టీ కార్యాలయాల్లో..
జనసేనాని ఆదేశాల మేరకు, తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల జనసేన పార్టీ కార్యాలయాల్లో జనసేన పార్టీ జెండా అవనతం కార్యక్రమం జరిగింది.
ఈ జనసేన పార్టీ జెండా అవనతంపై కొన్ని విమర్శలు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తున్నాయి. ‘జాతీయ జెండా కదా అవనతం చేయాల్సింది.? జనసేన పార్టీ జెండాతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారా.?’ అన్న విమర్శలొస్తున్నాయి.
కానీ, అలా విమర్శిస్తోన్నవారికి అసలు విషయం తెలీదు. జాతీయ జెండాని అవనతం చేయాల్సి వస్తే, అది కూడా ప్రత్యేక సందర్భాల్లో కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది.
జాతీయ జెండా వేరు.. పార్టీ జెండా వేరు..
ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ అలా నిర్ణయాలు తీసుకోలేదు. పార్టీ జెండా విషయమై, పార్టీలకు వెసులుబాట్లు వుంటాయి.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపే క్రమంలో జనసేన పార్టీ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించింది ఈ జెండా అవనతం కార్యక్రమం ద్వారా.
Also Read: డేంజరస్ గేమ్ ఆడుతున్నావ్ నానీ.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జాతీయ జెండాకి ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
అసందర్భ ప్రేలాపనలు సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయ్. జాతీయ జెండా రూల్స్ చదివితే, విమర్శించేవాళ్ళకి అసలు విషయం అర్థమవుతుంది.
దేశమంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సందర్భమిది. రాజకీయాలు, రాజకీయ విమర్శలు ఆ తర్వాత చూసుకోవచ్చు. జరిగిన ఘటన, దేశం మీద తీవ్ర వాదం చేసిన దాడి.!