Paid Negativity On Mega Acharya.. ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు.. దాన్ని చంపెయ్యాలన్న ‘కసి’ మొదలైపోతోంది కొందరికి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఇందుకు మినహాయింపేమీ కాదు.
‘ఆచార్య’ (Acharya Movie) చుట్టూ ఇప్పటికే చాలా విషపు రాతలు షురూ అయిపోయాయ్. ఇంకా ఇంకా వస్తూనే వున్నాయ్.!
‘ఆచార్య’ ప్రోమోలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఎందుకు కనిపించలేదు.? అంటూ ఓ వెకిలి ప్రశ్న ఇప్పటికే పుట్టుకొచ్చింది. పూజా హెగ్దే (Pooja Hegde) నెగెటివ్ సెంటిమెంట్ అంటూ ఇంకో మతి లేని వాదన కూడా మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. ప్రోమో ఎలా కట్ చేయాలన్నదానిపై చాలా లెక్కలుంటాయ్. ఆ లెక్కల ప్రకారమే ప్రోమోస్ బయటకు వస్తున్నాయి.
Paid Negativity On Mega Acharya.. ఇంత కసి దేనికి.?
గతంలో ఓ లిరికల్ వీడియో విడుదల చేశారు. అందులో కాజల్ వుంది కదా.? అంటే, అది కనిపించదు వివాదాలు సృష్టించేవారికి. ‘ఆచార్య’ని ‘ఆర్ఆర్ఆర్’తో పోల్చుతున్నారు.. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’తో కూడా పోల్చేస్తున్నారు.

‘ఆచార్య’కి డిజాస్టర్ సెంటిమెంట్ అప్పుడే అద్దేస్తున్నారు. సినిమాలో కంటెంట్ వుంటే హిట్టవుతుంది.. లేకపోతే ఫట్టవుతుంది.
కంటెంట్ ఒక్కటే సరిపోదు.. ఒక్కోసారి మంచి కంటెంట్ వున్నా సినిమాలు ఫెయిలవుతాయి.. కంటెంట్ లేకపోయిన సినిమాలు హిట్టవుతాయ్.!
ఇక్కడున్నది మెగాస్టార్ చిరంజీవి.!
దర్శకుడు కొరటాల శివని చిరంజీవి ఇబ్బది పెట్టేశారనీ, చరణ్ (Ram Charan) వల్ల కూడా కొరటాల క్రియేటివిటీ దెబ్బ తిందనీ.. ఇలా రూమర్స్ కుప్పలు తెప్పలుగా సృష్టించేసి, ‘ఆచార్య’ మీద మేగ్జిమమ్ నెగెటివిటీ తెచ్చేందుకు కొందరు ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే వున్నారు.
ఎవరి గోల ఎలా వున్నాగానీ, ‘ఆచార్య’పై అంచనాలు ఆకాశాన్నంటేశాయ్. సినిమా హిట్టయితే.. ఆ లెక్కలు వేరేలా వుంటాయ్.! ‘మెగా కాంపౌండ్’ మీద పెయిడ్ నెగెటివిటీ కాదు.
Also Read: Sonakshi Sinha.. బెట్టు చేస్తే అంతే.! మెట్టు దిగక తప్పదంతే.!
పైగా, చిరంజీవి సినిమాల్లోకి వచ్చినప్పటినుంచీ నెగెటివిటీ మీద విజయం సాధిస్తూనే వున్నారు.! ఈ నెగెటివిటీ ఆయనకు ఓ లెక్కా.?