Home » శారీ డ్రేపిస్ట్.! ‘అందంగా’ చీర కట్టగలిగితే లక్షల్లో సంపాదన.!

శారీ డ్రేపిస్ట్.! ‘అందంగా’ చీర కట్టగలిగితే లక్షల్లో సంపాదన.!

by Mudra369 Editorial Desk
0 comments
Saree Drapist Celebrity Business

Saree Drapist Celebrity Business.. అందంగా చీర కట్టుకోవడం అనేది ఓ కళ.! భారతీయ స్త్రీకి ఆ చీర కట్టు తెచ్చిపెట్టే ‘అదనపు అందం’ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే.!

ఔను, అందంగా చీర కట్టుకోవడాన్ని ఆస్వాదిస్తారు చాలామంది మహిళలు.! తమంతట తాముగానే ఆ చీరని అంత అందంగా కట్టుకోవడం భారతీయ స్త్రీలకు వెన్నతో పెట్టిన విద్య.

ట్రెండ్ మారింది.! పెళ్ళిళ్ళకీ, పెద్ద పెద్ద ఫంక్షన్లకీ.. చీర కట్టాలంటే, దాని కోసం ప్రత్యేకంగా కొందరు అందుబాటులో వుంటున్నారు.!

పేరేమో, శారీ డ్రేపిస్ట్.! అంతర్జాతీయ నిపుణులు కూడా వున్నారు ఈ ‘శారీ డ్రేపింగ్’ కోసం.! ఎంత తీసుకుంటారో తెలుసా ఫీజు.? లక్షల్లో.!

సెలబ్రిటీ వెడ్డింగ్స్ అంటే, ఈ డ్రేపిస్టులకి పండగే.! చిన్నా చితకా పెళ్ళిళ్ళకీ ఇప్పుడు ఈ డ్రేపిస్టుల అవసరం ఎక్కువైపోయింది.!

Saree Drapist Celebrity Business.. ముందుగానే డిజైన్ చేసిన శారీస్..

ముందుగానే డిజైన్ చేయబడిన శారీస్‌ని కట్టుకోవడమంటే అంత తేలికైన వ్యవహారం కాదు మరి.! చీర అనేది చీరలా కాకుండా, అదొక ప్రీ డిజైన్డ్ కాస్ట్యూమ్ అయిపోయింది.

జస్ట్ అలా, వేసేసుకోవడమే చీర స్పెషాలిటీ ఇప్పుడు.! కట్టుకోవడం, చుట్టుకోవడం కాదు.. వేసేసుకోవడమన్నమాట.! అంటే, ఓ గౌన్ వేసుకున్నట్లుగా.!

క్లిక్ చెయ్యండి.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా దీపావళి సెలబ్రేషన్స్.. కోసం

ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన శారీలోకి, అందాల భామలు అలా ఒదిగిపోవాలంటే, దాని కోసం మళ్ళీ కొంత సమయం పడుతుంది.

ఖరీదైన చీరల్ని డిజైన్ చేస్తారు కదా, అవి పాడైపోకుండా.. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. పిన్నులు సున్నితంగా గుచ్చాల్సి వుంటుంది.. చిన్న చిన్న కుట్లు తాత్కాలికంగా వేయాల్సి వస్తుంది.

చీర కట్టు మాత్రమే కాదు..

చీర కట్టేస్తే సరిపోదు.. ఆపై, ఆ డిజైనర్ శారీకి మ్యాచ్ అయ్యే నగల్ని కూడా అందంగా అతివ శరీరంపై అమర్చడం ఇంకో కళ. ఇది కూడా, కొందరు డ్రేపిస్టులు చేస్తున్నారు.

మేకప్, హెయిర్ స్టైల్.. వీటన్నిటికీ ప్రత్యేకంగా నిపుణులు వున్నట్లే, శారీ డ్రేపింగ్ అనే కళకీ నిపుణులన్నమాట. వజ్రాభరణాల, బంగారు ఆభరణాల విషయంలో, ఆ నిపుణులు మళ్ళీ వేరుగా వుంటారు.

సాధారణంగా 35 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఈ సెలబ్రిటీ శారీ డ్రేపిస్టులు వసూలు చేస్తుంటారట. అంటే, మాంఛి లాభసాటి వ్యాపారమే కదా ఇది.!

కోట్ల రూపాయల ఖర్చులో.. లక్షలు ఏపాటి..

కోట్లు వెచ్చించి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు.. అందులో ఓ రెండు లక్షలు.. అనేది చాలా చాలా చిన్నమాట కదా.!

అన్నట్టు, శారీ డ్రేపిస్టులు వందల కొద్దీ వెరైటీల్లో చీరకట్టుని డిజైన్ చేస్తుంటారట.. అదీ అత్యంత ప్రత్యేకంగా.

తాజాగా, సినీ నటి మిర్నాలిని రవి వివాహ వేడుకలో ఓ శారీ డ్రేపిస్ట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. అతను ఇంటర్నేషనల్ శారీ డ్రేపిస్ట్ అట.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group