Table of Contents
Parakala Prabhakar Tweetulu.. ఎవరీ పరకాల ప్రభాకర్.? ప్రస్తుతానికైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త.! అవునా.? మరి, సోషల్ మీడియాలో ఆ బూతులేంటి.?
గతంలో పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) రాజకీయ నాయకుడే.! పలు ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు కూడా.! స్వయం ప్రకటిత మేధావి.! పుస్తకాలు కూడా రాసేశాడట.!
ఈ రోజుల్లో పుస్తకాలు రాయడం ఏమన్నా గొప్ప విషయమా.? ఎవడన్నా రాసెయ్యొచ్చు.! అదేనండీ, రాయించేసుకుని, తమ పేర్లు ఏసేసుకోవచ్చు.
Parakala Prabhakar Tweetulu.. ఒకప్పటి ప్రజారాజ్యం నేత..
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తూ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో (Praja Rajyam Party) పరకాల ప్రభాకర్ పని చేశారు. పార్టీని వీడే క్రమంలో నానా రకాల విమర్శలూ చేశారు.
రాజకీయాలన్నాక ఇలాంటోళ్ళు మామూలే. పార్టీ వీడే క్రమంలో, అప్పటిదాకా తిన్నదంతా కక్కేయడం ఏ రాజకీయ నాయకుడికైనా మామూలే.
బూతులు తిట్టాలంటే, బాగా చదువుకున్న మేధావి అయి వుండాలా.?
తానే బాగా తిట్టగలనని ఎవరైనా అనుకుంటే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటుండదు.!
దిగజారడం అంటూ మొదలైతే, ఆ పతనం అత్యంత హేయం.!
గొప్పవాడిగా కీర్తి సంపాదించడానికి చాలా కష్టపడాలి.!
స్థాయిని దిగజార్చేసుకోవడానికి చిన్న మాట సరిపోతుంది.!
పరకాల ప్రభాకర్ తన స్థాయిని ఎక్కువగా ఊహించుకుంటుంటారు.. కానీ, అది అధమ స్థాయి.. అని ఆయన బూతు ట్వీట్లతో నిరూపితమవుతోంది.
Mudra369
అలా, ప్రజారాజ్యం పార్టీ మీద ‘విష వృక్షం’ అన్న ఆరోపణలు చేసినందుకుగాను, పరకాల ప్రభాకర్, టీడీపీ హయాంలో ‘సలహాదారు’ పదవి పొందారన్నది బహిరంగ రహస్యం.
ఆ సలహాలు రాష్ట్రానికి ఎంత ఉపయోగపడ్డాయి.? అనడక్కండి, అదో ‘రాజకీయ నిరుద్యోగులకు పునరావాస’ పథకం.!
ఇప్పుడెందుకీ ‘మొరుగుడు’.!
సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారట.! దాంతో, ‘కుక్కలు మొరుగుతున్నాయ్..’ అంటూ, అంతకన్నా అసభ్యకరమైన పదజాలంతో సోసల్ మీడియాలో దూషణలకు దిగాడు పరకాల (Parakala Prabhakar).
తాజాగా, ‘ఈడు కూడా జెండా పీకేత్తాడంట కదా? ఇన్నాళ్ళూ నాకిన చంక దిగి ఇంకో చంక ఎక్కుతాడంట కదా? ప్యాకేజీ కుదిరిపోయిందంట కదా?’ అంటూ ట్విట్టర్లో పరకాల పేలాడు.!
ప్రజారాజ్యం, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ.. ఇన్ని పార్టీల్లో పరకాల ప్రభాకర్ వెలగబెట్టాడాయె.! అంటే, జెండాలు పీకెయ్యడం, చంకలు నాకడం, ప్యాకేజీలు.. ఇవన్నీ ఆయనకీ వర్తిస్తాయా.? అన్న క్వశ్చనింగు వస్తుంది కదా.?
మూతి ఎవరికి పగిలేను.?
‘మూతి పగలడం’ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నాడు పరకాల తన ట్వీట్లలో.! ఈయనేసే ట్వీటుకే ఎవరి మూతులో పగిలితే, అట్నుంచి వేల సంఖ్యలో.. లక్షల సంఖ్యలో తిట్లు పడుతున్నాయ్ మరి.!
ఆ లెక్కన, పరకాల మూతి ఎన్నిసార్లు పగిలినట్లు.? తోక, రెండు కాళ్ళ మధ్య ఎన్నిసార్లు పెట్టుకుని పారిపోయినట్లు.? అని నెటిజనం ప్రశ్నిస్తోంది.
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
ప్రతిరోజూ ఓ నిర్దిష్ట సమయంలో ట్వీట్లు అట.! ఏం, అటువైపు ఖాళీగా లేరా.? వున్నారు, కౌంటర్ ఎటాక్ పడుతూనే వుంటుంది.! ఇదో ప్రసహనం.!
ఓడిపోయినోళ్ళవి దాక మొహాలు, పిత్త పరిగె మొహాలు అయితే, పరకాల ఎన్నిసార్లు ఓడిపోయాడు మరి.? ఆ మొహం ఏంటి మరి.. అని ప్రశ్నించేవాళ్ళకి పరకాల సమాధానమేమిటో.!