Pavitra Naresh సీనియర్ నటుడు నరేష్, తన మూడో భార్యకు గత కొంతకాలంగా దూరంగా వుంటున్నాడు.! ఆయన, మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
ఇంతకీ, నరేష్ (Actor Naresh) కొత్తగా పెళ్ళాడబోయేది ఎవర్ని.? ఇంకెవర్ని.. సీనియర్ నటి పవిత్ర లోకేష్‌ని.! ఆమెకి కూడా గతంలో పెళ్ళయ్యింది.. కాదు కాదు, పెళ్ళిళ్ళు అయ్యాయట.!
నరేష్ నాలుగో పెళ్ళి చేసుకున్నా, పవిత్ర లోకేష్ రెండోదో.. మూడోదో పెళ్ళి చేసుకున్నా.. ఇందులో తప్పు పట్టడానికేమీ లేదు. ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం.
Pavitra Naresh.. తప్పు పట్టడానికేముంది.?
చట్టబద్ధంగా విడాకులు తీసుకుని, ఇంకో పెళ్ళి చేసుకుంటే తప్పు పట్టాల్సిన పనే లేదు. కాకపోతే, ‘మా ప్రపంచంలోకి రండి..’ అంటూ నరేష్ వీడియో విడుదల చేయడమే ఒకింత హాస్యాస్పదంగా మారింది.
వాళ్ళ ప్రపంచంలోకి ఎవరైనా ఎందుకు వెళతారు.? ఎవరి ప్రపంచం వాళ్ళది.! ‘మీ ప్రపంచంలోకి మేమెందుకులే..’ అంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారందుకే.!
ఇంతకీ, మూడో భార్యతో నరేష్‌కి విడాకులు వచ్చేసినట్లేనా.? ప్చ్.. ఇంకా ఆ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు లేదు. అందుకే, ‘త్వరలో పెళ్ళి..’ అంటూ ప్రకటించారు.
మూడో భార్య ఏమంటుందో..
నరేష్ మూడో భార్య రమ్య.. గత కొంతకాలంగా నరేష్‌పై న్యాయపోరాటం చేస్తోంది. మరోపక్క, పవిత్ర లోకేష్ భర్త (మాజీ భర్త అని కూడా అనొచ్చేమో) కూడా న్యాయపోరాటమని అంటున్నాడట.
ఎవరి గోల వారిది.! ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. వాళ్ళ జీవితంలోకి ఇంకొకరు ఎందుకు తొంగి చూడాలి.? ఆ అవసరమే లేదు.
Also Read: నటన చేతకాదట.! తాప్సీకి ఎందుకిలా అనేసిందట.?
కాకపోతే, ఓ వీడియో విడుదల చేసి.. అందులో పవిత్రని (Pavitra Lokesh) గాఢంగా ముద్దు పెడుతున్న సన్నివేశాన్ని జొప్పించి.. సభ్య సమాజానికి సీనియర్ నటుడు ఏం సందేశం ఇవ్వనున్నట్లు.?
రొమాన్స్‌కి వయసుతో సంబంధం లేదని చెప్పదలచుకుంటున్నాడా.? అంతేనేమో.! అలాగే అనుకోవాలేమో.! ట్రెండు మారింది.! పెడార్థలు తీయడం మానేయడమే బెటర్.! ఇంతకీ, పెళ్ళెప్పుడు.?