Sri Satya Biggboss Telugu.. బిగ్ బాస్ రియాల్టీ షోలో చిత్ర విచిత్రమైన విన్యాసాలు నడుస్తుంటాయ్. కెప్టెన్సీ టాస్క్ విషయమై నడిచే రచ్చ అంతా ఇంతా కాదు.
ఎవర్ని కెప్టెన్‌గా చెయ్యాలన్నదానిపై బిగ్ బాస్ టీమ్ ఓ పక్కా ప్రణాళికతో వుంటుంది. అందుకు తగ్గట్టుగానే అన్నీ జరుగుతుంటాయ్.
కంటెస్టెంట్లు కెప్టెన్సీ టాస్క్ కోసం పడరాని పాట్లూ పడటం అనేది జస్ట్ బిగ్ బాస్ గేమ్ మాత్రమే.
ఇప్పడిదంతా ఎందుకంటే, ఈ సీజన్‌లో కెప్టెన్సీ విషయమై హాటెస్ట్ కంటెస్టెంట్ శ్రీ సత్య తరచూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తోంది.
‘కెప్టెన్ అవడం కంటే, బ్యాడ్ కెప్టెన్ అవకుండా వుండడం ముఖ్యం..’ అంటూ శ్రీ సత్య పదే పదే వ్యాఖ్యానిస్తోంది. ఎందుకిలా.?
Sri Satya Biggboss Telugu.. ట్రోలింగ్ మామూలుగా లేదు బాస్.!
శ్రీ సత్య ఈ సీజన్‌లో ఇంతవరకు టాస్కుల్లో గట్టి పోటీ ఇచ్చింది లేదు. కాకపోతే, గ్లామర్ పరంగా ఈ సీజన్‌కి ఆమె చాలా పెద్ద అడ్వాంటేజ్ అన్న చర్చ జరుగుతోంది.
క్యూట్ అండ్ లవ్లీ అప్పీల్ ఆమెకు ప్లస్ పాయింట్. నెటిజనం ఆమె గ్లామర్‌కి ఫిదా అవుతున్నారు మరి.
సో, తాను ఏమీ చేయకపోయినా ఫర్వాలేదన్న భావనతో వుందామె. పైగా, కెప్టెన్సీ విషయమై ‘కెప్టెన్ అవకపోయినా ఫర్లేదు.. బ్యాడ్ కెప్టెన్ కాకపోతే అదే చాలు..’ అంటూ పదే పదే ఆమె చెబుతుండడం ఒకింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Alsoo Read: ఫాఫం ‘లైగర్’ పాప.! అనన్య పాండే కూడా ఔట్.!
ఎలాగూ కెప్టెన్సీ రాదు గనుక, ఆమె అలా ఫిక్సయిపోయి, ఇతరుల్నీ ఆమె తన దారిలోకి తెచ్చుకుంటోందన్నమాట.
ఈ విషయమై ట్రోల్స్, ఫన్నీ మీమ్స్‌తో సోషల్ మీడియా నిండిపోతోందనడం అతిశయోక్తి కాదేమో.!