జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 30 లక్షల రూపాయల విరాళాన్ని(Pawan Kalyan Donates 30 Lakhs For Ayodhya Rama Mandir) అందించారు. తిరుపతి పర్యటనలో భాగంగా పలు రాజకీయ అంశాలపై స్పందించిన జనసేన, రాజకీయ ప్రత్యర్థులకు తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారు.
రాజకీయాల్ని పక్కన పెడితే, అయోధ్య రామాలయం కోసం ఆయన ప్రకటించిన 30 లక్షల రూపాయల డొనేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. నిజానికి, పవన్ కళ్యాణ్.. ఇలా విరాళాలు ఇవ్వడం ఇదే కొత్త కాదు.
సైనిక సంక్షేమం కోసం గతంలో పెద్దయెత్తున విరాళం ప్రకటించారు.. కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.. ఒకటా.? రెండా.? పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) చేసిన ‘గుప్త దానాలు’ అన్నీ ఇన్నీ కావు.
చాలా కొన్ని విషయాలు మాత్రమే బయటకు కన్పిస్తుంటాయి.. అలాంటివాటిల్లో అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ప్రకటించిన 30 లక్షల రూపాయల విరాళం కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ ఏదన్నా విరాళం ప్రకటించారన్న వార్త బయటకు వచ్చిన ప్రతిసారీ, రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఓ ప్రశ్న దూసుకొస్తుంటుంది.
‘ఇప్పుడే ఎందుకు ఈ విరాళం ప్రకటిస్తున్నారు.?’ అన్నదే ఆ ప్రశ్న. ‘పబ్లిసిటీ కోసమే పవన్ విరాళాలు ప్రకటిస్తుంటారు..’ అనే ఆరోపణ తరచూ తెరపైకొస్తుంటుంది.. కానీ, పవన్ (Power Star Pawan Kalyan) ఇచ్చే చాలా విరాళాల్లో ‘గుప్తంగా’ జరిగేవే ఎక్కువ.
అయినా, పవన్‌ని (Pawan Kalyan) ప్రశ్నించే ఏ నాయకుడూ ప్రజల కోసం ఏనాడూ విరాళాలు ప్రకటించింది లేదు. ‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు..’ అన్న చందాన తయారయ్యింది రాజకీయ వ్యవస్థ. ‘వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చెడగొడ్తారు..’ అన్నది ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని రాజకీయ నాయకులకు బాగా సూటవుతుదేమో.!
రాజకీయాల్లో రాజకీయ విమర్శలు మామూలే. కానీ, ఇలాంటి విషయాల్లో విమర్శలు మాని, అభినందించగలిగితే ఆయా నాయకులు తమ స్థాయిని పెంచుకున్నవారవుతారు. చేతనైతే, పవన్‌కి పోటీగా విరాళాలు (Pawan Kalyan Donates 30 Lakhs For Ayodhya Rama Mandir) ఇవ్వగలగాలి. లేదంటే, సైలెంట్‌గా వుండాలి.
అంతే తప్ప, పవన్ విరాళాల్ని ప్రశ్నించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఇక, పవన్ సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే, పవన్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది. క్రిష్ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా, మరో రెండు మూడు సినిమాలు.. సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుంది.