Pawan Kalyan AP Politics.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ.? అని ప్రశ్నిస్తోంది ఓ వర్గం.! పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా వున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు.
మరి, పవన్ కళ్యాణ్ ఎక్కడ.? అన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది.? రాజకీయాలన్నాక కొన్ని వ్యూహాలుంటాయ్.!
జనసేన, ఇప్పుడు నడుస్తున్న చాలా రాజకీయ పార్టీల్లాంటిది కాదు.! జనసేన పార్టీకి కాంట్రాక్టర్ల నుంచి నిధులు అందవు.
అవినీతి, జనసేనకు తెలియదు.! సో, జనసేన పార్టీకి అవసరమైన నిధులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే సినిమాల నుంచే రావాలి. అందుకే, ఆయన సినిమాలు చేస్తున్నది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందనీ, పవన్ కళ్యాణ్ ఆ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారనీ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Pawan Kalyan AP Politics.. పవన్ కళ్యాణ్.. ఇదిగో ఇలా.!
సో, పవన్ కళ్యాణ్.. ఇదిగో ఇక్కడ.. సినిమాల్లో వున్నాడన్నమాట.! ఈ విషయం తెలిసీ, ఓ వర్గం మీడియా, పవన్ కళ్యాణ్ ఎక్కడ.? అన్న ప్రశ్న ఎలా వేస్తోందబ్బా.?
జనసేన పార్టీ తరఫున పొలిటికల్ యాక్టివిటీస్ యధాతథంగా నడుస్తున్నాయి. ‘వారాహి విజయ యాత్ర’కు చిన్న బ్రేక్ అంతే.!
పైగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.. ఆపై పండగల వాతావరణం.! ఈ టైమ్‌లో సినిమా పనుల్ని పవన్ కళ్యాణ్ చక్కబెట్టడం నేరమెలా అవుతుంది.?
వాళ్ళకెందుకు ఆ ఆందోళన.?
వస్తున్నది ఎన్నికల సీజన్.! పార్టీ విషయమై జనసేనానికి ఆందోళన వుండాలి. జనసేన శ్రేణులు ఆందోళన చెందాలి. కానీ, ఇక్కడ సోకాల్డ్ మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయ్.
చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు ఇస్తే, పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ కొందరు బుర్రలేని రాజకీయ నాయకులు, కొందరు మతిలేని పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నించేస్తున్నారు.
కామెడీకి పరాకాష్ట ఇది. చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు ఇస్తే, ఆ చంద్రబాబే సమాధానం చెప్పుకుంటారు. అవసరమైతే ఆ చంద్రబాబే సంబంధిత ట్యాక్స్ కట్టుకుంటారు.
Also Read: ఇండియా! భారత్! రెండు పేర్ల మధ్య చిచ్చు పెడుతున్నదెవరు?
ఇందులో జనసేనానికి ఏంటి సంబంధం.? ఆ మాత్రం ఇంగితం వుంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎందుకు ఇంత ఛండాలంగా తయారవుతుంది.?
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడవడంలేదంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన వేసిన బలమైన ముద్ర అలాంటిది.!