Pawan Kalyan Bro Collections.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘బ్రో’ అప్పుడే బ్రేక్ ఈవెన్ అయిపోయిందట.! ఈ విషయాన్ని స్వయంగా ‘బ్రో’ చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రకటించడం గమనార్హం.
టీజీ విశ్వ ప్రసాద్‌కి చెందిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై సముద్రఖని దర్శకత్వంలో ‘బ్రో’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
కాగా, ‘బ్రో’ సినిమాకి మొదటి రోజు నుంచీ మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది. రెండో రోజుకే డిజాస్టర్ అన్న ప్రచారం జోరందుకుంది. ఆదివారం వసూళ్ళు మరింత దారుణమన్న వార్తలూ వినిపించాయి.
అయితే, ‘బ్రో’ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాత్రం, సినిమా ఘనవిజయం సాధించిందని చెబుతున్నారు. ‘బ్రేక్ ఈవెన్’ సాధించేసిందనీ, ఇప్పుడు వస్తున్నవన్నీ లాభాలేనని చెప్పారాయన.
Pawan Kalyan Bro Collections.. రాజకీయ దుమారం..
‘బ్రో’ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ దుమారంపై స్పందించిన టీజీ విశ్వ ప్రసాద్, సినిమాని రాజకీయ కోణంలో చూడటంలో అర్థం లేదని అన్నారు.
అంతే కాదు, తనకు సంస్కారం వుందనీ.. దిగజారి విమర్శలు చేయలేననీ.. ‘బ్రో’ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్, సినిమా నిర్మాణం కోసం వెచ్చించిన సొమ్ములు.. వీటిపై మీడియా అత్యుత్సాహాన్ని టీజీ విశ్వ ప్రసాద్ తప్పు పట్టారు.
తాము ఆదాయపు పన్ను లెక్కల్లో అన్నీ చూపిస్తామనీ, ఇతరులెవరికీ ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారాయన.
సూపర్ కాన్పిడెంట్..
‘బ్రో’ ముందు ముందు మరిన్ని మైలు రాళ్ళు అందుకుంటుందని టీజీ విశ్వ ప్రసాద్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.
మంచి కథని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశామంటున్న టీజీ విశ్వ ప్రసాద్, ‘బ్రో’ ఫలితం పట్ల పూర్తిస్థాయి సంతోషంలో వున్నామని వివరించారు.
Also Read: Sreeleela Skanda.. ఇస్మార్ట్ రామ్‌నే డామినేట్ చేసేసిందే.!
మరోపక్క, ‘బ్రో’ వివాదం కొనసాగుతూనే వుంది. డిజాస్టర్ టాక్ విషయంలో తగ్గేదే లే.. అంటున్నారు హేటర్స్.. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులు.
అయినా, నిర్మాతకి లేని నొప్పి.. రాజకీయ నాయకులకి ఎందుకు.?