Pawan Kalyan BRO Sequel.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి గతంలో ‘బ్రో-2’ సినిమా వచ్చింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది.!
తమిళంలో తానే నటించి, దర్శకత్వం వహించిన సినిమాని, తెలుగులోకి పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో సముద్రఖని రీ-మేక్ చేసిన విషయం విదితమే.
నిజానికి, చాలా మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. తెలుగు నేటివిటీ కోసం చేసిన మార్పులు బాగా వర్కవుట్ అయ్యాయి కూడా.
తమన్ సంగీతం, ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘గోపాల గోపాల’ తర్వాత, ‘దేవుడి’ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘బ్రో-2’.
అప్పటికీ.. ఇప్పటికీ.. చాలా మారింది..
అప్పటి, పొలిటికల్ ఈక్వేషన్స్, పొలిటికల్ వివాదాలు.. దానికి తోడు, విపరీతమైన నెగెటివిటీ ‘బ్రో’ రిజల్ట్ మీద కొంత ప్రభావం చూపిన మాట వాస్తవం.
ఆ ‘బ్రో’ సినిమాకి సీక్వెల్ రూపొందించడానికి తాను సిద్ధమంటూ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రకటించడంతో, ఒక్కసారిగా ‘బ్రో-2’పై నెగెటివిటీ షురూ అయ్యింది.
ఓ వర్గం మీడియా, ‘బ్రో-2’పై అప్పుడే విషం చిమ్మడం మొదలు పెట్టింది. ‘బ్రో’ ఫ్లాప్ అనీ, ‘బ్రో-2’ అవసరమే లేదనీ, సోకాల్డ్ మేతావులు తీర్మానించేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గనుక, సముద్రఖనికి ఇంకో ఛాన్స్ ఇస్తే, ఈసారి రిజల్ట్ వేరే లెవల్లో వుంటుందన్నది నిర్వివాదాంశం. అప్పటికీ, ఇప్పటికీ చాలా మారాయి.
‘ఓజీ’ సినిమా రిజల్ట్ చూశాం.! అందులో, పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ కూడా చూశాం.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా, తమ అభిమాన నటుడి సినిమాల్ని, ఇంతకు ముందుకంటే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
సినిమాలు.. రాజకీయాలు.. బ్యాలెన్స్..
సినిమాల్ని, రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయడంలో, పరిణతి సాధించారు పవన్ కళ్యాణ్ అభిమానుల సైతం.
ఈ క్రమంలో, పవన్ కళ్యాణ్ ఓ వైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, ఇంకో వైపు కొత్త సినిమాలకు కమిట్ అయ్యేందకు సమాలోచనలు చేస్తున్నారు.
కథ సెట్టయ్యి, అంతా కుదిరితే.. ‘బ్రో-2’ సినిమా సెట్స్ మీదకు వచ్చేందుకు అవకాశాలున్నాయి.
ఈలోగా నెగెటివిటీ.. అంటారా.? పవన్ కళ్యాణ్ సినిమాకి ఓ వర్గం మాఫియా.. అదే, మీడియా నుంచి నెగెటివి మామూలే కదా.!
