Pawan Kalyan Bro Shoes తొక్కేశాడు.! చాలా గట్టిగా తొక్కేశాడు.! ఆ ‘పవర్’ తొక్కుడుకి తల బద్దలైపోయినట్టుంది.!
అసలేం జరిగింది.? ఏం జరుగుతుంది, నిజానికి.. ఏమీ జరగలేదు.! జస్ట్ ‘బ్రో’ (Bro The Avatar) సినిమా నుంచి ఓ పోస్టర్ బయటకు వచ్చిందంతే.
మేనమామ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej) కలిసి కనిపించారు ‘బ్రో’ తాజా పోస్టర్‌లో.
తన ‘గురు’ పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడమంటే సాయి ధరమ్ తేజ్‌కి అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది.?
Pawan Kalyan Bro Shoes ఎందకలా తొక్కేశావ్.?
కానీ, ఇక్కడ ఒకడికి పిడి గట్టిగా పడింది. అక్కడికేదో, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తన నెత్తి మీద కాలు పెట్టి తొక్కేసినట్టుగా ఫీలైపోయాడు.

పవన్ కళ్యాణ్ ధరించిన ‘షూ’ ఖరీదెంతో తెలుసా.? దేవుడు షూ వేసుకోవడమేంటి.? అంటూ పిచ్చితనాన్ని అక్షర రూపంలోకి మలచి, వెబ్‌సైట్ వేదికగా వదిలేశాడు.
చాలామంది, ఈ వార్తలోని పైత్యం చూసి నవ్వుకున్నారు.! కొంతమంది చీవాట్లు పెట్టారు. రాసినోడికీ పాపం కష్టంగా అనిపించి వుండొచ్చు.
Also Read: బండ్ల సలహా.! గురూజీకి గిఫ్టు కొట్టు.! నిర్మాతగా ఛాన్సు పట్టు.!
‘వాడు.. నేను కాదు..’ అంటూ తనను తానే ఏమార్చుకునేందుకు ప్రయత్నించాడు. రాయించినోడికి రాసినోడు ఎప్పుడూ చులకనే కదా.! ఉద్యోగం పోగొట్టుకున్నాడు రాసినోడు.!
పొద్దున్న లేస్తే మెగా కుటుంబం మీద ఏడుపే..
వేరే పనేం లేదు.! పొద్దున్న లేస్తే మెగా కుటుంబం మీద ఏడుపే.! మెగా కుటుంబం మీదనే కాదు, ఎవర్నీ వదలరు.. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అందరి మీదా ఏడుపే.!
అందుకేనేమో, ఓ పోస్టర్ చూసి.. తన తల తానే బద్దలుగొట్టేసుకునేంతలా బాధపడిపోయాడు.. చివరికి ఫలితం అనుభవిస్తున్నాడు.!
Also Read: రామ్ చరణ్.! జర జాగ్రత్త.! గుడ్డిగా నమ్మితే వెన్నుపోటే.!
జర్నలిజం అంటే బ్లాక్‌మెయిల్ చేయడం.. అనుకునేటేళ్ళు.. తమ వేలితోనే, తమ కంట్లోనే పొడిచేసుకోక తప్పదు.!
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తొక్కెయ్యడం కాదు.. అలా అనుకుని, తమను తామే తొక్కేసుకున్నారన్నమాట ఈ బులుగు వీరులు.!