Pawan Kalyan Cars.. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan)
ఒక్కో సినిమాకీ 50 నుంచి 75 కోట్ల వరకూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెమ్యునరేషన్ తీసుకుంటారనేది సినీ పరిశ్రమలో వినిపిస్తోన్న ఊహాగానాల సారాంశం.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మీద విమర్శలు చేసే క్రమంలో ఆయన రెమ్యునరేషన్ గురించీ చెబుతుంటారు.
Pawan Kalyan Cars.. ఎవరు పిల్ల యెదవలు చెప్మా.?
మరి, జనసేనాని పవన్ కళ్యాణ్.. (Janasena Party Chief Pawan Kalyan) తన పార్టీ కోసం లక్షలు విలువ చేసే కార్లు కొనలేరా.? ఆ కార్లను ఇంకెవరో బహుమతిగా ఇవ్వాలా.? ‘పిల్ల యెదవలు’ చేసే విమర్శలు ఇలాగే వుంటాయ్.!
ఓ మహిళా నేత, పైగా కీలక పదవిలో వున్న ఓ సినీ నటి, జనసైనికుల్ని (Janasainiks) ‘పిల్ల యెదవలు’ అని అభివర్ణించారు మరి.!

దానిక్కారణం, సదరు మహిళా నేతకు ఇటీవల కీలక పదవి వచ్చేసరికి, ఆమె తన కుమారుడికి ఖరీదైన కారుని కొనిచ్చారు.. దానిపై విమర్శలొచ్చాయి.
ఫాఫం.. నిజం ఒప్పేసుకుందే.!
నేను సినిమాల్లో లక్షలు సంపాదించాను.. ఖరీదైన కారు కొనుక్కోలేనా.? అని ప్రశ్నించారామె. ఆమె స్వయంగా పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ స్టార్’ అని గతంలో విమర్శించారాయె.
Also Read: చిరంజీవిపై ఎర్ర పుష్పం వెర్రి కూతలు.! పేటీఎం పైత్యమే.?
మరి, ఇక్కడ ‘పిల్ల యెదవ’ ఎవరు.? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఫాఫం.. ఆ మహిళా నేత పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) అభిమానుల్ని తిట్టబోయి, తనను తానే తిట్టేసుకున్నారేమో.!
రాజకీయాల్లో అప్పుడప్పుడూ ఇలాగే నాయకుల నోట ‘నిజాలు’ వచ్చేస్తాయ్.! తాము ఏం మాట్లాడినా జనం గొర్రెల్లా నమ్మేస్తారనుకునే నాయకులు.. అప్పుడప్పుడూ ఇలా నోరు జారి నిజాలు కూడా చెప్పేస్తుంటారు.