Pawan Kalyan Chiranjeevi Dirty Politics.. ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆ మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.! అన్నయ్య అడుగుజాడల్లో సినిమాల్లోకి వచ్చాడు తమ్ముడు.!
రాజకీయంగా చూసినా అంతే.! అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) అడుగుజాడల్లోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వచ్చాడు.
సినిమాల్లో చాలా అరుదుగా అన్నయ్యను తమ్ముడు ఇమిటేట్ చేస్తే.. అన్నయ్య కూడా తన తమ్ముడ్ని ఇమిటేట్ చేశాడు.. అదీ ‘భోళా శంకర్’ సినిమా కోసం.!
ఇప్పుడిదంతా ఎందుకంటే, చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరూ వేర్వేరు కాదు.! మా ఇద్దరి గమ్యం ఒకటే.. కాకపోతే, దారులు వేరు.. అని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పారు.!
మరి, పవన్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవిని కావొచ్చు.. చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్‌ని కావొచ్చు.. ఎందుకు విమర్శిస్తున్నట్లు.?
Pawan Kalyan Chiranjeevi Dirty Politics.. అభిమానులే అర్థం చేసుకోకపోతే.?
అబ్బే, అభిమానుల ముసుగులో ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు.. సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రచ్చ ఇది.. అని తేలిగ్గా కొట్టి పారేయలేం.
ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam Party) తాలూకు చేదు అనుభవాలు జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇది బహిరంగ రహస్యం. అది ప్రత్యర్థులు చేస్తోన్న దుష్ప్రచారం వల్ల మాత్రమే.
అంతే తప్ప, చిరంజీవి కావొచ్చు.. పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) కావొచ్చు.. పరస్పరం ఒకరి వల్ల ఒకరికి నష్టం కలిగిందని ఏనాడూ భావించలేదు, భావించబోరు.!
హత్యలూ.. వెన్నుపోట్లూ.. సబబేగానీ..
హత్యలు గుండె పోట్లుగా మారతాయ్ రాజకీయాల్లో.. వెన్నుపోట్లు కూడా రాజకీయాల్లో ‘సబబే’ అనిపించబడ్తాయ్.!
కానీ, అన్నదమ్ముల మధ్య మాత్రం రాజకీయం చిచ్చు పెడుతుంది. అదే అసలు సమస్య. తప్పుడు ప్రచారం.. అది తప్పుడు మనుషులు చేసే ప్రచారం.. వ్యవస్థల్ని నాశనం చేస్తుంది.
Also Read: సిగ్గొదిలేశారు.! ‘సీఎంవో’లో మహిళా జర్నలిస్టుల కొట్లాట.!
రాజకీయాల్లో మంచి మార్పుకి నాంది పలకాలనుకున్న వ్యక్తులకు, తప్పుడు రాజకీయాలు గుదిబండలుగా మారతాయ్.!
చిరంజీవికీ (Mega Star Chiranjeevi) ఆ తప్పుడు రాజకీయం వల్ల ఇబ్బందులు తప్పలేదు.. పవన్ కళ్యాణ్‌కీ తప్పడంలేదు. ఇదీ వాస్తవం.!