Pawan Kalyan Chiranjeevi Surekha.. పెన్ను కాదది గన్ను.! ఇదేదో సినిమా డైలాగ్ అనుకునేరు.! జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో ‘పెన్ను’ కూడా, ‘గన్ను’లానే పని చేస్తుంది మరి.!
పైగా, ఆ ‘పెన్ను’ని బహుమతిగా ఇచ్చినవారెవరో కాదు, స్వయానా పవన్ కళ్యాణ్ వదినమ్మ.! ఔను, కొణిదెల సురేఖ, తన బిడ్డ లాంటి మరిదికి ప్రేమతో ఇచ్చిన బహుమతి అది.!
మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. వదినమ్మ ఆప్యాయంగా ఆ పెన్నుని, పవన్ కళ్యాణ్ జేబులో పెట్టారు.
Pawan Kalyan Chiranjeevi Surekha.. వదినమ్మ కానుక..
అయితే, కేవలం ‘పది’ రూపాయల విలువ చేసే పెన్ను తన జేబులో పెట్టుకున్న పవన్ కళ్యాణ్, ‘ఈ పెన్ను వుంది కదా’ అంటూ, వదినమ్మ ఇచ్చిన అత్యంత విలువైన పెన్నుని తీసుకుంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ.. వదిన, అన్నయ్య.. అంటూ ఓ వీడియోను మెగాస్టార్ చింజీవి పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఇటీవలి ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్‌కి మెగాస్టార్ చిరంజీవి ఘన స్వాగతం పలుకుతూ తన ఇంటి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పదవీ ప్రమాణ్ స్వీకార మహోత్సవానికి, చిరంజీవికి ‘స్టేట్ గెస్ట్’ ఆహ్వానం కూడా లభించింది. తన తమ్ముడు పవన్ కళ్యాణ్, మంత్రిగా అదే వేదికపై ప్రమాణ స్వీకారం చేయడంతో మురిసిపోయారు చిరంజీవి.