Pawan Kalyan Cinema Money.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.! ఈ పేరు వింటే, ఓ రేంజ్ గూస్‌బంప్స్.! అదే ‘పవనిజం’ అని అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పుకునేవారు.
ఆ పవనిజం కాస్తా, ఇప్పుడు వాళ్ళని జనసైనికులుగా మార్చేసింది. ‘పవర్ స్టార్ అనకండి.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాన్నేను.. గెలిచాక అప్పుడు చూద్దాం..’ అనేవారు పవన్ కళ్యాణ్, 2019-24 మధ్యలో.
2024 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచాక, ‘పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్’ అయ్యారు పవన్ కళ్యాణ్.
ఇంతకీ, సినిమాల సంగతేంటి.? గతంలో మొదలెట్టిన సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.
Pawan Kalyan Cinema Money.. సినిమాలున్నాయ్.. కానీ, రిలీజ్ డైలమా..
‘హరి హర వీర మల్లు’ సినిమా ఎప్పుడో విడుదలైపోవాల్సి వుంది. త్వరలో విడుదలయ్యేందుకు అవకాశాలున్నాయి. డేట్ వచ్చేసినా, నమ్మలేకపోతున్నారు అభిమానులు.
మరోపక్క, ‘ఓజీ’ కూడా ఎప్పటినుంచో నిర్మాణంలో వుంది. కాదు కాదు, షూటింగ్ కొంతకాలం జరిగి, ఆగింది. అది మళ్ళీ పునఃప్రారంభమవ్వాలి షూటింగ్.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా స్టార్ట్ అయ్యి, ఆగిపోయింది. అదెప్పుడు మళ్ళీ ప్రారంభమవుతుందో తెలియదు. ఈలోగా దర్శకుడు హరీష్ ఇంకర్ ఇంకో సినిమా చేసేశాడు. మరో సినిమా మొదలెట్టబోతున్నాడు.
కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాలంటే, పొలిటికల్ కమిట్మెంట్స్ అడ్డం వస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కి అదే పెద్ద సమస్య.
అవినీతి సొమ్ములొద్దు.. సినిమా సంపాదనే ముద్దు..
కానీ, సినిమాల ద్వారా వచ్చే ఆదాయం పవన్ కళ్యాణ్‌కి అవసరం. ఇతర రాజకీయ నాయకుల్లా, రాజకీయాల్లో సంపాదించుకునే ఆలోచన పవన్ కళ్యాణ్‌కి లేదు మరి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో, ‘నాకు సంపాదన అవసరమైనన్నాళ్ళూ సినిమాలు అవసరం, అవి చేస్తూనే వుంటాను..’ అని చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్.

అలాగని, పొలిటికల్ కమిట్మెంట్స్‌కి సినిమాలు అడ్డంకిగా మారే పరిస్థితి రాకుండా చూసుకుంటానని పవన్ కల్యాణ్ స్పష్టతనిచ్చేశారు.
సో, రాజకీయాల్లో కొనసాగుతూనే పవన్ కళ్యాణ్, సినిమాలు చేస్తూనే వుంటారన్నమాట. కానీ, సినిమాలు రిలీజ్ కాకపోతే ఎలా.? ఇదే అభిమానుల ఆవేదన.