Pawan Kalyan Fans Votes పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్తా, జనసేనాని పవన్ కళ్యాణ్ అయ్యారు.! అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు.?
‘రాజకీయాలు నాకు సరిపడవ్..’ అని మెగాస్టార్ చిరంజీవి, ‘ప్రజారాజ్యం’ అనుభవంతో ఓ అవగాహనకు వచ్చారు, రాజకీయాలకు దూరంగా వున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులే జనసైనికులు.! ఆ జనసైనికులు, జనసేన పార్టీకి కాక ఇంకెవరికి ఓటేస్తారు.?
Mudra369
మరి, పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి.? 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఈ రెండిటినీ పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కొనబోతున్నారు.?
Pawan Kalyan Fans Votes.. ఆహా.! ఏమి ప్రశ్న.?
మీ అభిమానులు మీకెందుకు ఓట్లెయ్యలేదు.? అన్నట్లుగా నందమూరి బాలకృష్ణ ‘ఆహా అన్‌స్టాపబుల్’ టాక్ షో ద్వారా ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్పి వుంటారు.? నిజానికి, ఇదేమీ కొత్త ప్రశ్న కాదు. గతంలో కూడా పవన్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

‘నా అభిమానుల ఓట్లు నాకు పడ్డాయ్.. కానీ, మేం డబ్బు ఖర్చు చేయలేదు ఓట్లు కొనడానికి. అక్కడే వచ్చింది సమస్య.. దాంతోపాటుగా, మా మీద దుష్ప్రచారం చేశారు..’ అంటూ జనసేన అధినేత స్పందించారు గతంలో.
సో, ఇప్పుడు కూడా పవన్ అదే సమాధానం చెప్పి వుండొచ్చు ‘ఆహా’లో.
అభిమానులు ఓట్లేశారా.? వెయ్యలేదా.?
పవన్ కళ్యాణ్ అభిమానులెవరూ ఆయనకి కాకుండా ఇంకొకరికి ఓటు వేసే పరిస్థితే వుండదన్నది నిర్వివాదాంశం. పవన్ కళ్యాణ్ బరిలో లేకపోతే, ఓటెయ్యడమైనా మానేస్తారేమో.!
అదే పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రత్యేకత.. అనే వాదనా లేకపోలేదు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చీలిక తెచ్చే క్రమంలోనే ‘అభిమానులు మీకు ఓట్లెయ్యలేదు కదా.?’ అన్న ప్రశ్న వస్తుంటుంది.
బాలయ్య నోట కూడా ఇలాగే ఆ ప్రశ్న వచ్చిందేమోనన్నది చాలామంది డౌటానుమానం.!
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
బెదిరింపులు, ప్రలోభాలు.. కుల, మత వర్గ సమీకరణాలు.. ఇంత ఛండాలంగా తయారైన రాజకీయాల్లో, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాలు చేయడమంటే చిన్న విషయం కాదు.!
మార్పు ప్రజల్లోంచి రావాలి. ఇప్పుడున్న వ్యవస్థలో నలిగిపోతున్న ప్రజలే, కొత్త రాజకీయాల వైపు అడుగేయాలి. ఆ ఆలోచన ప్రజల్లో వస్తే, అభిమానుల ఓట్లకు ఆ ఓట్లు అదనంగా తోడై.. జనసేన అధికారంలోకి వస్తుంది.