Table of Contents
Pawan Kalyan For Better Politics: నా సినిమాని తొక్కేద్దామనుకుంటున్నారా.? తొక్కేసి చూడండి దమ్ముంటే.. అంటూ ఏకంగా ఓ ప్రభుత్వాన్ని సవాల్ చేసిన ‘పవర్’ పవన్ కళ్యాణ్‌ది.
అలాంటి పవన్ కళ్యాణ్, పదవి కోసం జనసేన పార్టీని తాకట్టు పెడతారా.? ‘ప్యాకేజీ’ అంటూ కొన్నిజంతువులు మొరుగుతుంటాయ్. అలా మొరిగే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, అధికారం చేతిలో వున్నాగానీ, ఆ ‘ప్యాకేజీ’ ఏంటో బయటపెట్టలేని అసమర్థత వాటిది.
బ్లూ అండ్ యెల్లో మొరుగుడు.!
బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్‌కి రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి.. అంటూ ఎప్పటికప్పుడు ‘బ్లూ’ పుకార్లు వస్తూనే వుంటాయ్. వీటికి ‘యెల్లో’ పుకార్లు కూడా తోడవుతుంటాయ్.
రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి కావాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే, అది 2014 ఎన్నికల సమయంలోనే డిసైడ్ అయిపోయేది.

పవన్ కళ్యాణ్ ఆలోచనలు, పవన్ కళ్యాణ్ వ్యూహాలు.. వేరే లెవల్.! ‘మార్పు’ అన్న ఆలోచన ప్రజల్లోంచి రావాలి. మార్పు తీసుకురావాల్సింది ప్రజలే. మార్పు కోసం పవన్ కళ్యాణ్ నినదించడం మాత్రమే చేస్తాడు. నాయకుడెవరైనా చేయాల్సింది అదే.
Pawan Kalyan For Better Politics.. పవన్ కళ్యాణ్ నిఖార్సయిన నాయకుడు కాబట్టే.!
ఏదన్నా సమస్య వస్తే, ముందుగా జనసేన అధినేత వద్దకు బాధితులు ఎందుకు వెళతారు.? ఆయనైతే తమ సమస్య పట్ల సానుకూలంగా స్పందిస్తారనీ, ఆయన దృష్టికి ఏదన్నా సమస్యను తీసుకెళితే, ఆ సమస్య గురించి గట్టిగా మాట్లాడాతరని.
అందుకే, కొందరికి పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అంటే భయం. అధికారం వెలగబెట్టినోళ్ళకీ, అధికారం వెలగబెడుతున్నవాళ్ళకీ పవన్ కళ్యాణ్ అంటే ఆ భయం వుండబట్టే.. ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు.. ఇదిగో ఇలాంటి పాచిపోయిన పుకార్లను సరికొత్తగా ఎప్పటికప్పుడు వడ్డించేయాలనుకుంటారు.
పొత్తు పెట్టుకోవడమంటే అమ్ముడుపోయినట్టా.?
రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణం. పొత్తు పెట్టుకోవడమంటే అమ్ముడుపోయినట్టు కాదు. పొత్తుకి అర్థం అమ్ముడుపోవడమే అయితే, దేశ రాజకీయాల్లో దాదాపు అన్ని పార్టీలూ అమ్ముడుపోయినట్టే.. అధికారికంగానో, అనధికారికంగానో.!
అయినా, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొత్తులు పెట్టుకున్నది అధికారం కోసమో, ప్యాకేజీల కోసమో కాదు.. ప్రజల కోసం.. ప్రజల్లో మార్పు కోసం.. ఆ ‘మార్పు’ నినాదం ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళడం కోసం. ఎనీ డౌట్స్.!

నిప్పులాంటి నిజం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అమ్ముడుపోయే రకం కానే కాదు. అమ్ముడుపోయే రకమే అయితే, పార్టీ ఆర్థికావసరాల కోసం సినిమాల్లో నటించడం దేనికి.?
Also Read: పెద్దాయనా.! అట్టా ఎట్టా సచ్చిపోయినవ్.!
తన సినిమా విడుదలకు రాజకీయ ఆటంకాలు ఎదురైనా ఆయనెందుకు ‘బస్తీ మే సవాల్.. దమ్ముంటే ఆపి చూడు..’ అని ప్రభుత్వానికి ఎలా సవాల్ విసరగలుగుతారు.?
తల తెగిపడే పరిస్థితి వచ్చినా తల వంచే రకం కాదు పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan). ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది. అదే చాలామందికి కంటగింపుగా మారింది.!