Table of Contents
Pawan Kalyan For People.. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్.! ఈ మాట తరచూ రాజకీయాల్లో వినిపిస్తుంటుంది. అసలు రాజకీయాల్లో గెలవడమంటే ఏంటి.?
మంత్రి అవ్వాలంటే, ప్రజా క్షేత్రంలో గెలవాల్సిన అవసరం లేదు. నామినేటెడ్ కోటాలో చట్ట సభకు ఎంపికైతే మంత్రి అయిపోవచ్చు. ప్రజల ఓట్లతో పని లేకుండా దేశానికి ప్రధాని మంత్రి కూడా అవ్వొచ్చు.
మరి, ‘గెలవడం’ అనే మాటకు అర్థమేంటి.? విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచేసి.. ఓటర్లను ప్రలోభ పెట్టేసి గెలిస్తే, దాన్ని గెలుపు అనగలమా.? రాజకీయాలపై గెలుపోటముల గురించిన చర్చ జరిగి తీరాలి.
గెలవడం కోసం యుద్ధం ఎవరితో చేస్తున్నారు.?
అయినా, నాయకులు గెలవడమేంటి.? ఓడిపోవడమేంటి.? సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నారా.? యుద్ధాలు చేయడానికి వస్తున్నారా.?
దండయాత్రలు చేసినప్పుడు మాత్రమే గెలుపోటముల చర్చ జరుగుతుంటుంది. గెలిస్తే సామ్రాజ్యం దక్కుతుంది.. ఓడితే, ప్రాణం కూడా పోవచ్చు. రాజకీయం అలా కాదు కదా.!

‘ఓట్ల కోసం డబ్బులు పంచను.. మద్యంలో జనాన్ని ముంచను..’ ఇదీ పవన్ కళ్యాణ్ నినాదం. ఇంతకన్నా స్పష్టత ఇంకేం కావాలి.? ప్రజలకు సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారుగానీ, ప్రజల మీద దండయాత్ర చేయడానికి కాదు కదా.!
గెలుపు.. అంటే ప్రజల మీద దండయాత్రేనా.?
‘మేం గెలిచాం..’ అని చెప్పుకునే సోకాల్డ్ పార్టీలు, ప్రజల మీద దండయాత్ర చేసి, గెలిచామనే అర్థంలో ఆ మాట అంటున్నాయేమో.!
ఒకవేళ ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లానే పవన్ కళ్యాణ్ కూడా గెలవాలంటే, డబ్బులు పంచాలి.. మద్యంలో ఓటర్లను ముంచాలి. జనాన్ని ప్రలోభ పెట్టాలి. ఇంతేనా.? ఇదే రాజకీయమా.?
Also Read: ప్రజా క్షేత్రంలో గెలిస్తే, ‘తప్పు’ ఒప్పయిపోతుందా.?
పదవుల కోసం నానా గడ్డీ తినే సోకాల్డ్ రాజకీయ నాయకులు, పవన్ కళ్యాణ్ ఓటమి మీద విమర్శలు చేస్తోంటే, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.!
Pawan Kalyan For People ఓడినోడే ఆదుకుంటున్నాడు.!
సరే, గెలిచినోళ్ళ వల్ల ప్రజలకు ఒరిగిందేంటి.? గెలిచిందే ప్రజల్ని కాల్చుకు తినడానికి.. అన్నట్టు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తోంటే.. అలాంటివాళ్ళ గెలుపు.. ప్రజలకు శాపం కాక మరేమిటి.?
చిత్రమేంటంటే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓడిపోయినా, ప్రజలకు మేలు చేయగలుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి.. పవన్ కళ్యాణ్ గెలవాలంటే ఏం చేయాలి.?