Pawan Kalyan Gabbarsingh Remuneration.. చిన్న విషయమే.. చినికి చినికి గాలి వానగా మారింది.!
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్ద ‘గబ్బర్ సింగ్’ సినిమా ప్రస్తావన వచ్చింది.
‘గబ్బర్ సింగ్’ సినిమాని పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అప్పటికి బిగ్గెస్ట్ హిట్‌గా చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వున్న సమయంలో వచ్చిన సినిమా అది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా, బాలీవుడ్ మూవీ ‘దబాంగ్’కి రీమేక్. పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ ‘గబ్బర్ సింగ్’లో హీరోయిన్‌గా నటించింది.
Pawan Kalyan Gabbarsingh Remuneration.. రెమ్యునరేషన్ ఎంత.?
ఇంతకీ, ‘గబ్బర్ సింగ్’ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత.? ఈ ప్రశ్న, నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చింది. దానికి ముసి ముసిగా నవ్వేశారు పవన్ కళ్యాణ్.
బాగా వర్కవుట్ అయ్యింది కదా.? అన్న కోణంలో బాలయ్య అడిగితే, ‘నేను అనుకున్నంత కాదు.. ఆయన అనుకున్నంత..’ అంటూ పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు.
అంతే, పవన్ అభిమానులు గుస్సా అయ్యారు.. ‘అంటే, రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేదన్నమాట. బ్యాలెన్స్ అమౌంట్, జనసేన పార్టీకి ఇచ్చెయ్..’ అంటూ నిర్మాత బండ్ల గణేష్‌ని ఉద్దేశించి పవన్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు.
బండ్ల కూడా గుస్సా అయ్యాడు ఓ అభిమాని మీద. ‘ఎంతిచ్చానో చెబితే, నీ గుండె ఆగిపోతుంది..’ అంటూ బండ్ల సమాధానమిచ్చాడు.
నా విశ్వరూపం కూడా చూపిస్తా..
మరో ట్వీట్‌కి స్పందిస్తూ ‘నా విశ్వ రూపం కూడా చూపిస్తా..’ అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు. ఈ స్పందన వైరల్‌గా మారింది.
‘పవన్ కళ్యాణ్‌ని నువ్వు చాలా అభిమానించావ్. కానీ, పాపులర్ టాక్ షో అని కూడా చూడకుండా అలా మాట్లాడాడు..’ అంటూ బండ్ల గణేష్‌కి ఓ ట్వీటేశాడో నెటిజన్. దానిపైనే పై విధంగా బండ్ల స్పందించాడు.
బండ్ల గణేష్ ట్వీటు ప్రకారం చూస్తే, పవన్ కళ్యాణ్‌కే ఆయన విశ్వరూపం చూపించబోతున్నాడని అర్థం చేసుకోవాలేమో. కానీ, అంతలోనే ‘ఐ లవ్ యూ పవన్ కళ్యాణ్ సర్’ అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Also Read: బాలకృష్ణతో ‘కళాతపస్వి’ విశ్వనాథ్.! ఈ ఫ్లాప్ సినిమా తెలుసా.?
నిజానికి, పవన్ తన సొంత బ్యానర్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా చేయాలనుకున్నాడు. కానీ, దాన్ని బండ్ల గణేష్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు.
ఆ ఇద్దరి మధ్యా ఎలాంటి డీల్ జరిగిందన్నది ఆ ఇద్దరికే తెలుసు. ఇక, ట్రోలింగ్ అంటారా.? అది అర్థం పర్థం లేని వ్యవహారం.!