‘మేక్ ఎ విష్’ అంటే, కొంతమందికి అదో పెద్ద కామెడీ. కానీ, ఆ ‘మేక్ ఎ విష్’ (Make A Wish) వెనుక ఎన్నో కన్నీళ్ళు వుంటాయి.. గుండె పగిలే రోదనలు వుంటాయి. నయం కాని అనారోగ్యంతో బాధపడుతున్నవారు.. చనిపోతామని తెలిసీ, చివరి కోరిక కోరితే.. దాన్ని నెరవేర్చడమే ‘మేక్ ఎ విష్’ (Pawan Kalyan God At Heart) ఉద్దేశ్యం.
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడేవారికి చికిత్స సందర్భంగా నరకయాతన ఎదురవుతుంటుంది. ఆ సమయంలో వారికి కాస్తంత సాంత్వన కలిగేలా.. కొంత సంతోషం కలిగించేలా ఏ చిన్న పని చేసినా, అది వారికి ఊరటనిస్తుంది.. ప్రాణాంతక వ్యాధులతో పోరాడే ధైర్యాన్నిస్తుంది. కొన్ని సందర్భాల్లో అద్భుతాలూ జరుగుతాయి. చనిపోవడం ఖాయమనుకున్నవారు కోలుకుంటారు.
ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు, అలాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారిని ఓదార్చుతుంటారు. తమ మీద వారికున్న అభిమానం నేపథ్యంలో.. వారు కోలుకోవాలని ప్రార్థిస్తుంటారు.. ఆర్థిక సహాయమూ అందిస్తుంటారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గతంలో ఓ అభిమాని ఇంటికి అలాగే వెళ్ళారు. ఆ అభిమాని పేరు శ్రీజ. పవన్ కళ్యాణ్‌ని (Pawan Kalyan God At Heart) చూడాలని తపించిన ఆమె, తీరా పవన్ వచ్చేసరికి.. కను రెప్పల్ని కూడా కదల్చలేకపోయింది.. పవన్ కళ్యాణ్‌ని చూడలేకపోయింది.

అయితేనేం.. ఆమె కోలుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ని కలుసుకుంది. తీవ్ర అనారోగ్యంతో మంచాన పడ్డ శ్రీజను చూసి కంటతడి పెట్టిన పవన్, ఆమె కోలుకుని తనను కలిసేందుకు వస్తే.. ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా, పవన్ కళ్యాణ్.. మరో అభిమాని ఇంటికి వెళ్ళారు. భార్గవ్ అనే ఓ అభిమాని క్యాన్సర్ బారిన పడి, ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు.
పవన్ కల్యాణ్‌ని కలవాలనే భార్గవ్ తపన.. సోషల్ మీడియా ద్వారా, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. పవన్, భార్గవ్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. భార్గవ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఆర్థిక సాయం అందించారు. ‘నీకేం కాదు.. నువ్వు బావుంటావ్..’ అని భార్గవ్‌కి చెబుతూ పవన్ (Pawan Kalyan God At Heart) భావోద్వేగానికి గురయ్యారు.
శ్రీజలానే భార్గవ్ కూడా కోలుకోవాలని.. లక్షలాది మంది.. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, ఇతర హీరోల అభిమానులూ కోరుకుంటున్నారు. పవన్ మాత్రమే కాదు, చాలామంది హీరోలు.. తమ అభిమానులెవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వుంటే, వారిని కలిసేందుకు వెళుతున్నారు.. ఆర్థిక సాయం అందిస్తున్నారు.. కొన్ని ప్రాణాలు నిలబడుతున్నాయి.. కొందరికి చివరి కోరిక తీరుతోంది.
మన హీరోలు నిజంగానే గొప్పోళ్ళు. విమర్శించేవాళ్ళు ఎప్పుడూ వుంటారు.. సాయం చేయడం చేతకానోళ్ళు చేసే విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం (Pawan Kalyan God At Heart) లేదంతే.!