జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Janasena) ఏం మాట్లాడారు.? అన్నది అర్థం కాకుండానే, ఆయన ప్రసంగాన్ని కొందరు ‘సొల్లు పురాణం’గా అభివర్ణించేస్తున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే, ఇతర మతాలకు చెందినవారూ ఆ దాడుల్ని ఖండించాలన్నారు. అదే సెక్యులర్ దేశమన్నారు. ఇది జనసేన భావజాలం. ఇందులో అర్థం కాకపోవడానికేముంది.?
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణమైన రీతిలో హత్యకు గురైతే, తొలుత ‘గుండెపోటు’ అన్నారు నిస్సిగ్గుగా. పోనీ, సమాచార లోపం అనుకుంటే.. ఆ తర్వాత, చంద్రబాబు చేయించిన హత్య.. అని ఆరోపించారాయె. అధికారంలోకి వచ్చాక, అదే మాటకు కట్టుబడి, చంద్రబాబుని జైల్లో వేయించాలి కదా.? ఇదీ జనసేన సంధించిన మరో ప్రశ్న. ప్చ్.. సమాధానం వుండదాయె.
ది గ్రేట్ సొల్లు పురాణం ఎవరిది
రాష్ట్రంలో రోడ్లు నాశనమైపోయాయ్.. అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలెదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యను ప్రస్తావించారు. కానీ, అది ది ‘గ్రేట్’ ‘సొల్లు పురాణం’ గాళ్ళకి అర్థం కాదాయె. ఎవర్నో తిడితే, ఇంకెవరికో అర్థం పర్థం లేకుండా నొప్పులొచ్చేస్తున్నాయ్.. అదే అసలు సమస్య.
Also Read: నిస్సిగ్గు రాజకీయం.. ఓ మై సన్.. మదర్స్ హజ్బెండ్..!
సరే, రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయ్. రాజకీయ వ్యవస్థ అంతలా దిగజారిపోయింది. మీడియా ఏం చేస్తోంది.? రాజకీయం కంటే ఛండాలంగా దిగజారిపోయింది మీడియా. లేకపోతే, పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేసి, సవాలక్ష సమస్యల్ని ప్రస్తావిస్తే.. అది సొల్లు పురాణంలా ఎలా కనిపించింది.?
పవన్ కళ్యాణ్‌ని తిడితే ఏమొస్తుంది.? పవన్ కళ్యాణ్‌ని నిలదీస్తే ఏమొస్తుంది.? అధికారంలో వున్నవారిని నిలదీస్తే కదా.. కాస్తో కూస్తో ప్రజలకు మేలు జరుగుతుంది. అధికార పార్టీ అద్భుతంగానే పాలన అందించేస్తున్నా, అధికార పార్టీని ప్రశ్నించాలి, నిలదీయాలి.. ఇంకా ఇంకా గొప్పగా పరిపాలించడానికి.
సాని కబుర్లకేనా మీడియా.?
అంత సోయ వుంటే, మీడియాలో ‘సొల్లు’ పురాణం కథలు ఎందుకు వినిపిస్తాయ్.? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఎవడో ‘సాని’ కబుర్లు చెప్పేందుకు మీడియా ముందుకొస్తే, అదో గొప్ప హైలైట్ అంశం. అంతే తప్ప, ఓ చిన్నారిపై హత్యాయత్నం జరిగితే.. దానికి కవరేజ్ ఇవ్వడానికి ప్రభుత్వాల్ని నడుపుతున్నవారి నుంచి ‘గ్రీన్ సిగ్నల్’ వచ్చేదాకా ఎదురు చూసే స్థాయికి మీడియా సంస్థలు దిగజారిపోయాయ్.
Also Read: ప్రజలు.. ప్రభువులు.. కానుకలు.! ఇదేం ప్రజాస్వామ్యం.?
కొన్ని కులాలకి మాత్రమే అధికార పీఠమా.? అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ఇందులో తప్పేముంది.? ఇది సొల్లు పురాణమెలా అవుతుంది.? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Pawanism) ప్రశ్నలకు సమాధానం లేక, పవన్ వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేస్తున్నవారిది సొల్లు పురాణం.. అలాంటివారిని సమర్థిస్తున్న మీడియా సంస్థలది ది గ్రేట్ సొల్లు పురాణం. ఎనీ డౌట్స్.?
చివరగా, పవన్ కళ్యాణ్ ఇంట్లోని మహిళల మీద జుగుప్సాకరమైన విమర్శలు చేస్తోన్న రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలకు పవన్ ఓ భరోసా ఇచ్చారు చిత్రంగా. ‘మీ ఇంట్లోని ఆడవాళ్ళపై నేనెప్పుడూ అభ్యంతరకర వ్యాఖ్యలు చెయ్యను. వారి మీద నాకు గౌరవం వుంది. మా పార్టీ కార్యకర్తలెవరూ కూడా అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయరు, చేయనివ్వను..’ అని అన్నారు పవన్ కళ్యాణ్.
సరే, అందరూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎంతమంది దీన్ని ఫాలో అవుతారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఓ పార్టీ అధినేత.. లక్షలాదిమంది అభిమానులున్న ఓ స్టార్ హీరో.. ఈ మాట చెప్పగలిగాడంటే.. అదీ అతని సంస్కారం. అది అర్థం కాని మూర్ఖులకి పవన్ కళ్యాణ్ ప్రసంగం ‘ది గ్రేట్ సొల్లు పురాణం’గానే అనిపిస్తుంది. ఎనీ డౌట్స్.?
ప్రజల సొమ్ముతో.. ప్రజలకు పరిపాలన అందిస్తూ, సొంత పేర్లతో సంక్షేమ పథకాల మాటున రాజకీయ ప్రచారం చేసుకోవడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆ సొమ్ము ప్రజలదా.? నాయకుల జేబుల్లోంచి ఖర్చు చేస్తున్నదా.? ది గ్రేట్ సొల్లు పురాణం చెప్పే మీడియా, రాజకీయ నాయకులు.. మరీ ముఖ్యంగా మీడియా ముందుకొచ్చి, సిగ్గు లేకుండా రంకెలేస్తున్న వారెవరైనా ఈ ప్రశ్నకు.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా.? జస్ట్ ఆస్కింగ్.