జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖపట్నం వెళ్ళారు.. జన విస్ఫోటనాన్ని చూపించారు.!
అంతకు ముందు వరకూ ‘బస్తీ మే సవాల్.. ప్లేస్ నువ్వు చెప్పినాసరే, నన్ను చెప్పమన్నా సరే..’ అంటూ వెకిలితనం ప్రదర్శించిన బులుగు అమాత్యుల్లో ఒక్కరూ మాట మీద నిలబడలేకపోయారు.
వందల్లో కాదు, వేలల్లోనూ కాదు.. లక్షల్లో జనం తరలివచ్చారు జనసేనాని కోసం.! ‘మా నినాదం ఏకైక రాజధాని మాత్రమే..’ అని ఉత్తరాంధ్ర గడ్డ మీద పవన్ కళ్యాణ్ నినదించగలిగారు.!
Pawan Kalyan మాట మీద నిలబడ్డారు.. పని పూర్తి చేసుకున్నారు..
జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి వుంది. కానీ, పోలీసులు అనుమతించలేదు. దాంతో, నోవాటెల్ హోటల్‌కే పరిమితమయ్యారు పవన్ కళ్యాణ్.
కానీ, 60 లక్షల రూపాయల మేర చెక్కుల్ని పంపిణీ చేయాల్సి వుండగా, వాటిని అందుకోవాల్సినవారిని తన వద్దకే రప్పించుకుని.. ఆ పనీ పూర్తి చేశారు.

అక్రమ అరెస్టులు జరిగాయనీ, వారు విడుదలయ్యేదాకా విశాఖలోనే వుంటానని అన్నారు.. మాటకు కట్టుబడి, అరెస్టయిన జనసేన నేతలు విడుదలయ్యేదాకా విశాఖలోనే వున్నారు జనసేనాని.
విశాఖ నుంచి విజయవాడకు పయనం..
పని దాదాపుగా పూర్తయ్యింది.. మిగతా పని పూర్తి చేయడానికి విశాఖ నుంచి విజయవాడకు పయనమయ్యారు. గవర్నర్‌నే కలుస్తారో.. న్యాయపోరాటంలో ఇంకో లెవల్ చూపిస్తారో.! అది వేరే చర్చ.
కానీ, ఇక్కడ ది ‘గ్రేట్’ పతి‘వ్రత’ కథ ఒకటి తెరపైకొచ్చింది. ‘వ్రతము వీడిన పవన్ కళ్యాణ్’ అట. మాట ఇస్తే, కట్టుబడి వుండాలట. ఇంకా కొంతమంది విడుదల కావాల్సి వున్నా, పవన్ కళ్యాణ్ విజయవాడ చెక్కేశారట.!
జర్నలిజమా.? వ్యభిచారమా ఇది.? జర్నలిజమైతే కాదు.. ముమ్మాటికీ పాత్రికేయాన్ని వ్యభిచారంగా మార్చేసిన వైనమే.
Also Read: Megastar Chiranjeevi.. చచ్చేంతలా వాళ్ళని ఏడిపించేస్తే ఎలా.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సోకాల్డ్ నీఛ నికృష్ట రాజకీయం కంటే కూడా, ఈ వ్యభిచార పాత్రికేయమే అత్యంత ప్రమాదకరం.!
చివరగా.. జర్నలిజం అంటే, ప్రభుత్వాలు ప్రజలకు ఎంత మంచి చేసినా, చిన్న చిన్న పాలనా వైఫల్యాల్ని కూడా ప్రశ్నించాలి.. అసలంటూ ఇప్పుడు ప్రశ్నించే జర్నలిజం ఎక్కడ.? అమ్ముడుపోయే జర్నలిజం తప్ప.!