Pawan Kalyan Maharastra Elections.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినోడు.! కానీ, అది ఒకప్పుడు.! ఆ రెండు చోట్ల ఓడిపోయినోడే, 100 స్ట్రైక్ రేట్‌తో పార్టీని గెలిపించాడు.
2019 ఎన్నికలకీ, 2024 ఎన్నికలకీ జనసేన పార్టీ రాజకీయ ప్రస్తానం ఇదీ.! పవన్ కళ్యాణ్ అంటే, ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్.!
పవన్ నహీ.. ఆందీ హై.. అంటూ, ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత గురించి పొగిడారు. ‘ఆందీ’ అంటే, తుపాను.!
2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ – జనసేన – బీజేపీ గెలుపులో పవన్ కళ్యాణ్‌దే కీలక పాత్ర. అసలు ఈ కూటమి ఏర్పడటానికే పవన్ కళ్యాణ్ కారణం.
Pawan Kalyan Maharastra Elections.. పొత్తు ధర్మంలో భాగంగా..
ఇప్పుడు పవన్ కళ్యాణ్, జాతీయ స్థాయిలో ‘మిత్రపక్షం’ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడంతో, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోతోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, తెలుగువారు ఎక్కువగా నివసించే నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్డీయే కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Also Read: అప్పట్లో అనుష్క.! ఇప్పుడేమో దిశా పటానీ.!
ఇసుకేస్తే రాలనంత జనం.. జన సునామీ.. ఇవన్నీ చిన్న మాటలేనని అంతా అంటున్నారంటే, జనసేనాని చూసేందుకు వచ్చిన జన ప్రభంజనం అలాంటిది.
మరాఠీలో మాట్లాడుతూ, తెలుగులోనూ మాట్లాడుతూ, సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ.. జనసేనాని చేస్తున్న ఎన్నికల ప్రసంగాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
మొత్తమ్మీద, ‘దేశ్ కీ నేతా’ అనిపించుకోవడానికి జనసేనాని జస్ట్ ఓ అడుగు దూరంలో వున్నారంతే.!