Pawan Kalyan Mark Shankar.. జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మన్యం ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలోనే, ఆయన చెవిన ఓ చేదు వార్త పడింది.
సింగపూర్‌లో చదువుకుంటున్న పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ (చిన్న కుమారుడు), అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడన్నదే ఆ చేదు వార్త.
ఏడెమిదేళ్ళ చిన్నారికి అగ్ని ప్రమాదం అంటే.. ఏ తండ్రికైనా, అదెంత కష్ట సమయం.? వున్నపళంగా సింగపూర్ వెళ్ళాల్సి వున్నా, పవన్ కళ్యాణ్ వెళ్ళలేకపోయారు.
ఎందుకంటే, మన్యం ప్రాంతంలో అధికారిక కార్యక్రమాల్లో బిజీగా వున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ కార్యక్రమాల్ని వాయిదా వేసుకునే అవకాశమున్నా, అలా చేయలేదాయన.
Pawan Kalyan Mark Shankar.. గుండెల్లో అంత బాద పెట్టుకుని..
అధికారులు వారిస్తున్నా, సన్నిహితులు వద్దంటున్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజనులకు ఇచ్చిన మాటకు కట్టుబడి, పవన్ కళ్యాణ్ మన్యంలో పర్యటించారు.
అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి, గిరిజనుల మనసుల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాకే, ఆయన హైద్రాబాద్ వెళ్ళారు.
హైద్రాబాద్ నుంచి అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖతో కలిసి పవన్ కళ్యాణ్, సింగపూర్ పయనమయ్యారు తన కుమారుడు మార్క్ శంకర్‌ని చూసేందుకు.

అదే రోజు పెద్ద కొడుకు అకిరానందన్ పుట్టినరోజు. ఆ రోజునే, చిన్న కొడుకు ప్రమాదంలో గాయపడ్డ వార్త, పవన్ కళ్యాణ్ చెవిన పడ్డంతో, ఓ తండ్రిగా ఆయన ఎంత విలవిల్లాడి వుంటారో కదా.!
ఇలాంటి నిబద్ధత గల నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినందుకు, రాష్ట్ర ప్రజలంతా గర్వపడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం.
మెరుగుపడుతున్న మార్క్ శంకర్ ఆరోగ్యం..
సరే, కొందరు ఈ విషయాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తే, అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటుండదనుకోండి.. అది వేరే విషయం.
ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. ప్రాణాపాయమేమీ లేదని వైద్యులు ధృవీకరించారు. కాలికి, చేతులకీ కాలిన గాయాలు మానడానికి కొంత సమయం పడుతుంది.
Also Read: అక్కు పక్షీ.! విమానాల్ని ఎందుకు కూల్చేస్తున్నావ్.?
అగ్ని ప్రమాదాల్లో, పొగ పీల్చడం వల్ల ఎక్కువ ప్రమాదం సంభవిస్తుంది. మార్క్ శంకర్ కూడా పొగ పీల్చడం వల్లే, తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.
దీర్ఘ కాలంలో సమస్యలుంటాయని వైద్యులు సూచించిన దరిమిలా, మెరుగైన వైద్యం కోసం పవన్ కళ్యాణ్, సింగపూర్ వెళ్ళాక, తగిన మార్గాల్ని అన్వేషించే అవకాశముంది.
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.