Pawan Kalyan Next Surender Reddy.. చాన్నాళ్ళ క్రితమే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలొచ్చాయి.
కానీ, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు ఇప్పటిదాకా.! పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ ఈ ప్రాజెక్టు ఆలస్యమవడానికి కారణంగా చెప్పుకోవచ్చు.
ఓ దశలో, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కదనే ప్రచారమూ జరిగింది. కానీ, దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి తీరతాననే గట్టి నమ్మకంతో వున్నారు.
నిర్మాత రామ్ తాళ్ళూరి, ఈ ప్రాజెక్టుని తెరకెక్కించాల్సి వుంది. రామ్ తాళ్ళూరి, పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు.
Pawan Kalyan Next Surender Reddy.. జనసేనలో రామ్ తాళ్ళూరికి కీలక బాద్యతలు..
ఇటీవలే, రామ్ తాళ్ళూరికి జన సేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు జన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఇంతలోనే, రామ్ తాళ్ళూరితో పవన్ కళ్యాణ్ సినిమా.. అంటూ, వార్తలు మళ్ళీ షురూ అయ్యాయి. సురేందర్ రెడ్డి, ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేశారంటూ వార్తలొస్తున్నాయి కూడా.
పవన్ కళ్యాణ్ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల కావాల్సి వుంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించే సన్నివేశాల షూటింగ్ ఇటీవలే పూర్తయిపోయింది కూడా.
అయితే, ‘ఓజీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో, తాను ఈ సినిమాకి సీక్వెల్, ప్రీక్వెల్ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడం గమనార్హం.
మరోపక్క, ‘హరి హర వీర మల్లు’ సినిమాకి కూడా మరో పార్ట్ తెరకెక్కాల్సి వుంది. మరి, సురేందర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అవకాశమిచ్చేదెప్పుడు.?
ముందుగా సురేందర్ రెడ్డి సినిమానే.?
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుగా అవకాశవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: రిజెక్టెడ్ హీరోయిన్ రేంజ్ 300 కోట్లు.!
రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ నుంచి, తగినన్ని డేట్స్ ఖరారు చేసుకున్నాకనే, సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్టుని సెట్స్ మీదకు తీసుకెళతారట.
పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవనున్నాయి సురేందర్ రెడ్డి – రామ్ తాళ్ళూరి – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ప్రాజెక్టు గురించి.
