Pawan Kalyan OG పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ఓ వైపు రాజకీయం, ఇంకో వైపు సినిమా.. వెరసి, క్షణం తీరిక లేని పరిస్థితి ఆయనది.!
ముంబైలో ‘ఓజీ’ (They Call Him OG) సినిమా షూటింగ్ జరగడం.. ఈ క్రమంలో కొన్ని ఫొటోలు లీక్ అవడం తెలిసిన విషయాలే.!
అక్కడా, జనసేన మద్దతుదారులు పవన్ కళ్యాణ్‌ని చూసేందుకు ఎగబడ్డారు. అలా ‘ఓజీ’ సినిమాకి సంబంధించి ఆన్ లొకేషన్ ఫొటోలు బయటకు వచ్చాయి.!
Pawan Kalyan OG.. పవన్ కళ్యాణ్ ట్వీటు.!
తాజాగా, పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.. అదీ తన సినిమా గురించీ, అలాగే జనసైనికుల గురించీ. ముంబైలోని ‘వాయ్ లేక్’ వద్ద దిగిన ఫొటోనీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన జనసైనికులు పవన్ కళ్యాణ్‌ని (Pawan Kalyan) చూసేందుకు ముంబైకి వెళ్ళారు.
అక్కడే, ‘వాయ్ లేక్’ వద్ద చిన్న పడవలో, జనసేన జెండాని జనసేనానికి (Janasenani Pawan Kalyan) చూపించారు. ఈ క్రమంలో ‘ఓజీ’ యూనిట్, ఓ సూపర్బ్ ఫొటోని క్లిక్ మనిపించింది.!
Also Read: కత్తులు దూసిన సామ్.! ఆమె సంతోషంగా వుండాలన్న చైతూ.!
అదే ఇక్కడ మనం చూస్తున్న ఫొటో.! పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ నిమిత్తం ఈ డ్రెస్ వినియోగిస్తుంటారు పవన్ కళ్యాణ్.
అంటే, ‘ఓజీ’లో (Fire Storm Is Coming) పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), మార్షల్ ఆర్ట్స్ చేయబోతున్నారా.? అంతే అనుకోవాలి మరి.!