Table of Contents
Pawan Kalyan OG 300Cr.. మెగా కాంపౌండ్ నుంచి ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, విపరీతమైన ‘పెయిడ్ నెగెటివిటీ’ క్రియేట్ అవుతూ వస్తోంది.
ఓ వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు.. ఈ నెగెటివ్ పెయిడ్ క్యాంపెయిన్‌ని మెగా కాంపౌండ్‌కి వ్యతిరేకంగా నడుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ ‘పెయిడ్ నెగెటివిటీ’ కోసం.! ఇంతా చేసి, ఏం సాధిస్తున్నారంటే.. ప్చ్, ఏం లేదు.. అంతా పైశాచికానందం మాత్రమే’ అని చెప్పక తప్పదు.
Pawan Kalyan OG 300Cr.. ఓజీ.. నెగెటివిటీని అధిగమించి..
‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ఏ స్థాయి పెయిడ్ నెగెటివిటీ వచ్చిందో చూశాం. కానీ, ఆ సినిమా విజయాన్ని ఆ పెయిడ్ నెగెటివిటీ అడ్డుకోలేకపోయింది.
అయితే, ఈ తరహా పెయిడ్ నెగెటివిటీ కారణంగా, కొన్ని మెగా సినిమాలు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం.
పెయిడ్ నెగెటివిటీ కంటే, ఇతరత్రా అంశాలు, ఆయా సినిమాలు వర్కవుట్ కాకపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చనుకోండి.. అది వేరే సంగతి.
‘ఓజీ’ సినిమా విషయంలోనూ, అదే నెగెటివ్ పెయిడ్ క్యాంపెయిన్ నడిచింది. సినిమాని బాయ్‌కాట్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా కొందరు నానా హడావిడీ చేశారు.
కట్ చేస్తే, రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోలు.. ఆ ప్రీమియర్ షోల ద్వారా రికార్డు స్థాయి వసూళ్ళు కనిపించాయి. అయినా, నెగెటివ్ పెయిడ్ క్యాంపెయిన్ ఆగలేదు.
తొలి రోజు, రెండో రోజు.. మూడో రోజు.. ఇలా ఆ పెయిడ్ నెగెటివ్ క్యాంపెయిన్ నడుస్తూనే వచ్చింది. వారం దాటింది, ఇంకా లక్షల్లో ఖర్చు చేసి ‘ఓజీ’కి వ్యతిరేకంగా పెయిడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు.
బ్రేక్ ఈవెన్ అయ్యిందా.? లేదా.?
ఓజీ వసూళ్ళు వారం రోజులకి, దాదాపు మూడొందల కోట్ల వరకూ చేరుకున్నాయి. ఇవి గ్రాస్ లెక్కలు. షేర్ లెక్కల్ని తీసుకుంటే, దాదాపు రెండు వందల కోట్లను టచ్ చేస్తోంది ‘ఓజీ’.
కానీ, సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్‌కి చాలా దూరంలో వుందంటూ, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది. బ్రేక్ ఈవెన్ లెక్కలు ఎవరు చెప్పాలి.? నిర్మాతలు కదా.!
డిస్ట్రిబ్యూటర్లు విడుదల చేసిన సంఖ్యలంటూ.. ఓ వర్గం మీడియా, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ దుష్ప్రచారానికి తెరలేపాయి.
మరోపక్క, ‘ఓజీ’ టీమ్ ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్స్ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించడం చూశాం. అదే వేదికపై డిస్ట్రిబ్యూటర్లకు మెమెంటోలు కూడా అందించడం జరిగింది.
కోట్లు ఖర్చు చేసి ఓజీకి వ్యతిరేకంగా నెగెటివ్ క్యాంపెయిన్..
ఓవర్సీస్ లెక్కల్ని తీసుకుంటే, దాదాపు డబుల్ మార్జిన్ షేర్ సాధించింది ‘ఓజీ’. రికార్డు స్థాయి వసూళ్ళు, లాభాలన్నమాట ఓజీకి ఓవర్సీస్‌లో.
హిందీలో ‘ఓజీ’కి సరైన ప్రమోషన్లు చేయకపోయినా, హిందీ బెల్ట్‌లో నిలకడగా ‘ఓజీ’ వసూళ్ళను సాధిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ, బ్రేక్ ఈవెన్‌కి చాలా దగ్గర్లో వుంది ‘ఓజీ’.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
తెలుగు రాష్ట్రాల్లోనూ, దాదాపు ‘బ్రేక్ ఈవెన్’కి చేరుకుంది పవన్ కళ్యాణ్ ‘ఓజీ’. ఓటీటీ హవా నేపథ్యంలో, ‘బ్రేక్ ఈవెన్’ అనేది చాలా సినిమాలకి కనాకష్టంగా మారిపోయిన విషయం విదితమే.
విపరీతమైన పెయిడ్ నెగెటివిటీ మధ్యన, 300 కోట్ల గ్రాస్.. దాదాపు 200 కోట్ల షేర్‌తో.. దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిన ‘ఓజీ’ సినిమాపై, చిత్రంగా ఇంకా నెగెటివ్ పెయిడ్ క్యాంప్ రన్ అవుతోంది.
సినిమాకి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన దరిమిలా, వసూళ్ళ విషయంలో కొంత తగ్గుదల కనిపించింది.
‘సెన్సార్’ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా వుండి వుంటే.. ‘యూ/ఏ’ సర్టిఫికెట్ వచ్చి వుంటే, 400 కోట్లు, ఆపైన వసూళ్ళు ‘ఓజీ’కి వచ్చి వుండేవే.
