Pawan Kalyan OG Glimpse ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు.. సోషల్ మీడియాలో విపరీతమైన హైప్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.
సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతోన్న సినిమా తాలూకు హంగామా ఇది.!
ఇంతకీ, ఈ సినిమా టైటిల్ ఏంటి.? ‘ఓజీ’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ‘ఓజాస్ గంభీర’ అనేది అసలు పేరు అట. కాదు కాదు, ‘దే కాల్ హిమ్ ఓజీ’ అంటున్నారు ఇంకొందరు.
Pawan Kalyan OG Glimpse.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు హంగామా..
సెప్టెబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ‘ఓజీ’ (They Call Him OG) నుంచి టీజర్ రాబోతోంది. దానికి సంబంధించి, క్రియేట్ అవుతున్న హైప్ అంతా ఇంతా కాదు.
సినిమా రిలీజ్ తరహాలో ఎదురు చూస్తున్నారు అభిమానులు ఈ ‘టీజర్’ (Fire Strom Is Coming) గురించి. టీజర్ అనండీ.. గ్లింప్స్ అనండీ.. ఇంకోటేదన్నా పేరు పెట్టుకోండి.. ఆ పవర్ ఇచ్చే కిక్కే వేరప్పా.!
యువ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో 72 సెకెన్ల నిడివితో ఈ ‘గ్లింప్స్’ విడుదల కాబోతోందన్నది తాజా ఖబర్.!
స్టార్ కాస్టింగ్ ఇదీ..
ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ కాగా, శ్రియా రెడ్డి (Sriya Reddy) ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.
బ్యాక్ టు బ్యాక్ రీమేక్ సినిమాల తర్వాత.. పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రెయిట్ సినిమా ఇదే.! ఒకరకంగా చెప్పాలంటే, రీమేక్ సినిమాలతో పవన్ అభిమానులూ విసిగిపోయారు.
Also Read: మెగాస్టార్ చిరంజీవికి మించి.! ఇంకేముంటుంది.?
ఈ నేపథ్యంలో, ఈ ‘ఓజీ’పై భారీ అంచనాలే పెట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు.
డీవీవీ దానయ్య (DVV Danayya) ఈ చిత్రానికి నిర్మాత. తమన్ (Thaman Music) ఈ ‘ఓజీ’కి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.