Pawan Kalyan OG.. పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్‌లో సినిమా నేడే లాంఛనంగా ప్రారంభమైంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. అద్భుతమైన పాటలుండాలి. కానీ, ఈ సినిమాలో పాటలుండవట.
మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా వుండాలి.! కానీ, అవి కూడా లేకుండా సినిమాని డిజైన్ చేశారట.
Pawan Kalyan OG.. ప్రారంభానికి ముందే ఇన్ని లీకులా.?
సినిమా ప్రారంభమవడానికి ముందే ఇన్ని లీకులంటే.. అవి సినిమా అభిమానుల్ని.. అందునా, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని భయపెట్టకుండా వుంటాయా.?
అన్నట్టు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ బిజీగా వుంటారు గనుక.. షెడ్యూల్స్‌ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.
అది పవన్ కళ్యాణ్ నటించే ప్రతి సినిమాకీ కామనే కదా.! కానీ, ఇది ఇంకాస్త ప్రత్యేకమైన సినిమా అట.!
30 నుంచి 40 రోజులు మాత్రమే పవన్ కళ్యాణ్ డేట్స్ వున్నాయట ఈ సినిమాకి. ఇది ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గాసిప్ కదా.?
హీరోయిన్ కూడా వుండదంటున్నారు.! ఇదీ నిజమేనా.? తమన్ సంగీతం అందిస్తున్నాడు గనుక, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోతుంది.
అవన్నీ నిజాలేనా.?
సిట్యుయేషనల్ సాంగ్స్ మాత్రం రెండో మూడో వుంటాయన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. అంటే, పాటలుండవన్న గాసిప్ ఉత్తదేనన్నమాట.
ఇక, డేట్స్ విషయానికొస్తే.. నిర్మాతల ఫ్రెండ్లీ హీరో పవన్ కళ్యాణ్. ఆయన రాజకీయ వ్యవహారాలకు అనుగుణంగా నిర్మాతలూ, దర్శకులూ సర్దుబాట్లు చేసుకుంటారు. పవన్ కూడా, సినిమాకి చేయాల్సిందంతా చేస్తారు.
Also Read: చిరంజీవిలా మేం ‘క్వైట్’ కాదు.! రామ్ చరణ్ ‘మెగా’ హెచ్చరిక.!
సో, పవన్ కళ్యాణ్ అభిమానులైతే భయపడాల్సిందేమీ లేదు.! ‘ఓజీ’ సినిమాలో అన్నీ వుంటాయ్.!
ఏమీ లేకుండానే ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ (నిప్పుల తుపాను వస్తోంది’ అని సుజీత్ పేర్కొనడు కదా, పోస్టర్ మీద.?
పైగా, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా తీసిన బ్యానర్ అది.! డీవీవీ బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కాల్సిన సినిమా అంత చప్పగా ఎలా వుంటుంది.? ఛాన్సే లేదు.