Pawan Kalyan OG Journey.. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా ఏంటి.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత, సుజీత్ మీద ఏ నమ్మకంతో ప్రాజెక్ట్ కన్ఫామ్ చేసినట్లు.?
చాలా ప్రశ్నలు.. చాలా చాలా అనుమానాలు.! అసలు ఈ సినిమా ప్రారంభమై, పూర్తయ్యే అవకాశాలే లేవు. మధ్యలోనే ఆగిపోతుంది.! ఇలాంటి వెటకారాలూ చాలానే.!
కానీ, డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్‌లో ప్రారంభమైన ‘ఓజీ’ సినిమాని.
Pawan Kalyan OG Journey.. బ్రాండ్ పవన్ కళ్యాణ్..
‘ఓజీ’ సినిమాకి పవన్ కళ్యాణ్ బ్రాండ్ మీదనే బిజినెస్ జరగాలి. ఈ విషయం నిర్మాత డీవీవీ దానయ్యకీ తెలుసు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్లూ ఆయనకి తెలుసు.

2022 డిసెంబర్‌లో ‘ఓజీ’ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది.
అంటే, 2022 డిసెంబర్‌లో ప్రారంభమై 2025 సెప్టెంబర్‌లో విడుదలవుతోందన్నమాట. దాదాపు మూడేళ్ళ ప్రయాణమిది.
పవన్ కళ్యాణ్ రాజకీయాలు..
2022 డిసెంబర్ నాటికి పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ విషయమై చాలా భయాలున్నాయి.. అభిమానుల్లోనూ.! అలాంటిది, నిర్మాతకు వుండే భయాలేంటో ఊహించుకోవడమే కష్టం.
అయినాగానీ, నిర్మాత డీవీవీ దానయ్య ధైర్యంగా.. చాలా ధైర్యంగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక.. సీన్ మొత్తం మారింది.
Also Read: మహిళలు తలనీలాల్ని సమర్పించకూడదా.?
అయినాగానీ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల, సినిమాకి డేట్లు ఇవ్వడం కష్టమయ్యింది. అలా ముందుకీ వెనక్కీ.. అయ్యింది.

నిర్మాణ సంస్థకి, పవన్ కళ్యాణ్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. మరీ ముఖ్యంగా సుజీత్, తమన్.. ప్రాణం పెట్టేశారు.
మొత్తమ్మీద, అంతకు మించిన అంచనాలతో ‘ఓజీ’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇది మామూలు జర్నీ కాదు.. మూడేళ్ళ ‘ఓజీ’ జర్నీ.!
