Table of Contents
Pawan Kalyan OG Review.. పవన్ కళ్యాణ్ సినిమాకి హైప్ క్రియేట్ అవడం సర్వసాధారణం.! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే, హైప్ మీటర్.! అదొక పవర్ హౌస్.!
ముందు సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, తదుపరి సినిమాకి రేంజ్ పెరిగిపోతుంటుంది.. దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.!
అయితే, ‘ఓజీ’ సినిమా హైప్ మీటర్.. అంతకు మించి.! బహుశా చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య కూడా, ఈ స్థాయి ‘సునామీ’ని ఊహించి వుండకపోవచ్చు.
Pawan Kalyan OG Review.. దర్శకుడు సుజీత్‌కి పవర్ ఛాన్స్..
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన వద్దకు దర్శకుడు సుజీత్‌ని తీసుకొచ్చాడని పవన్ కళ్యాణ్, ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన సంగతి తెలిసిందే.
సుజీత్ అంటే, పవన్ కళ్యాణ్ భక్తుడు.! అది, ‘ఫైర్ స్టార్మ్’ అంటూ ‘ఓజీ’ నుంచి వచ్చిన తొలి గ్లింప్స్‌లోనే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
Also Read: Washi YO Washi – OG Pawan Kalyan’s Aura.!
ఇంతకీ, ఓజీ కథా కమామిషు ఏంటి.? ఓ భక్తుడు, తన దేవుడి సినిమాని ఎలా తెరకెక్కించాడు.? మరో భక్తుడు, తన దేవుడికి అందించిన సంగీతమెలా వుంది.?
ఇవన్నీ తెలియాలంటే.. ముందుగా కథలోకి వెళ్ళాలి…
ముంబై పోర్టు చుట్టూ నడిచే కథ. సత్య దాదాని చంపేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నితే, అప్పుడు రంగంలోకి దిగుతాడు గంభీర.! అసలెవరీ గంభీర.?
సత్య దాదాకి గంభీర ఏమవుతాడు.? ఓమీ ఎవరు.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, సినిమా చూడాల్సిందే. కథ ఇక్కడే చెప్పేస్తే, తెరపై సినిమా చూడ్డానికి అవసరమైన కిక్కు దొరకదు కదా.!
ఇది పవన్ కళ్యాణ్ సినిమా. ఆ పవన్ కళ్యాణ్ అభిమాని తీసిన సినిమా. సో, సినిమాలో ఎలివేషన్స్ వేరే లెవల్లో వుంటాయ్.. వున్నాయ్ కూడా.!
తెరపై, ప్రతి ఫ్రేమ్.. తన అభిమాన హీరోని ఓ దర్శకుడు ఎలా చూపించాలనుకుంటున్నాడో.. అలాగే వుంటాయ్. సినిమా చూస్తున్నంతసేపూ, మనల్నీ అభిమానులుగా మార్చేస్తాడు దర్శకుడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సరైన పాత్ర పడితే, ఆ పాత్రలో పవర్ ఎంతలా ఎలివేట్ అవుతుందో చెప్పడానికి గతంలో చాలా సినిమాలొచ్చాయ్. అంతకు మించి, ఎలివేషన్స్ ‘ఓజీ’లో మనం చూడొచ్చు.
కళ్యాణ్, తెరపై కనిపించినంతసేపూ, అంతకు మించి.. అనేలా వుంటుంది. ప్రతి సీన్లోనూ మాస్ అండ్ స్టైలిష్‌గా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడంటే, పూర్తి క్రెడిట్ దర్శకుడిదే.
పవన్ కళ్యాణ్ చేతిలో నాంచాక్, కటానా, గన్స్.. ప్రత్యేకంగా ఎదిగిపోతాయ్. వాటికి సరికొత్త గ్లామర్ అద్దుతారు పవన్ కళ్యాణ్. ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ ఆయుధం పట్టుకున్న ప్రతిసారీ ఈ విషయం నిరూపితమవుతుంది.
హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్రకు నిడివి చాలా తక్కువ. వున్నంత వరకూ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్ మామూలే. శ్రియా రెడ్డి పాత్ర మాత్రం సర్ప్రైజింగ్. అర్జున్ దాస్, తన పాత్రలో ఒదిగిపోయాడు.
ఓమీ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, స్టైలిష్‌గా కనిపించాడు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ప్రతి పాత్రకీ వున్నంతలో ప్రాధాన్యతనిచ్చాడు దర్శకుడు.
ఇక, సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపించింది. నడుస్తున్న సన్నివేశం తాలూకు మూడ్‌ని బాగా క్యాప్చర్ చేశాడు సినిమాటోగ్రాఫర్.
అసాధారణ సన్నివేశాలకు.. అంతకు మించి..!
సంగీతం గురించి చెప్పుకోవాలంటే, ముందుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించే మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ భక్తుడు కదా, కొన్ని సాధారణ సన్నివేశాలనీ, అసాధారణంగా మార్చేశాడు తమన్.
అసాధారణ సన్నివేశాల్ని, అంతకు మించిన స్థాయికి తమన్ తీసుకెళ్ళాడు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో. పాటలు కూడా వినడానికే కాదు, తెరపై చూడ్డానికి బావున్నాయి.
‘జానీ’ సినిమా రిఫరెన్స్, ‘ఓజీ’లో దర్శకుడు తీసుకొచ్చాడంటే, పవన్ కళ్యాణ్ పట్ల అతనికి వున్న అభిమానం, భక్తిని సూచిస్తాయి. ఈ విషయంలో సుజీత్‌కి, సాటి పవన్ కళ్యాణ్ అభిమానులంతా గుడి కట్టేస్తారేమో.
యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్. పవన్ కళ్యాణ్, వాటిని చేసిన తీరు అభినందనీయం. డబ్బింగ్ పరంగా, ఇంతకు ముందు సినిమా ‘హరి హర వీర మల్లు’తో పోల్చితే, పవన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
చాలాకాలం తర్వాత, పవన్ కళ్యాణ్ తెరపై ‘ఫ్రీ ఫ్లో క్యారెక్టర్’లో కనిపించడం అభిమానులకి పెద్ద పండగ. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుజీత్కే దక్కుతుంది.
ఓపెనింగ్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ..
ఓపెనింగ్ షాట్ నుంచీ.. ఆ మాటకొస్తే, టైటిల్ కార్డ్ నుంచీ శుభం కార్డు దాకా.. అభిమానులు కేరింతలు కొడుతూనే వుంటారు. అన్ని ఎలివేషన్ సీన్స్ వున్నాయి పవన్ కళ్యాణ్ హీరోయిజంకి సంబంధించి.
ఇక, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చేలానే కథ, కథనాలు సాగాయి. ఎక్కడా అశ్లీలతకు తావివ్వలేదు. హింస, రక్తపాతం మాత్రం ఎక్కువే. దానికే ‘ఎ’ సర్టిఫికెట్.
ఓవరాల్‌గా చెప్పాలంటే, కరువు తీరిపోయింది పవన్ కళ్యాణ్ అభిమానులకి. మరీ ముఖ్యంగా, పోలీస్ స్టేషన్ సీన్.. చాలా ఏళ్ళు మాట్లాడుకుంటారు, ఆ సీన్ గురించి.
పంగక్కి.. అసలు సిసలు మాస్ అండ్ స్టైలిష్ మూవీ ‘ఓజీ’.! రికార్డులంటారా.. అవి పవన్ కళ్యాణ్‌కి కొత్త కావు. ప్రీ రిలీజ్ రికార్డులన్నీ ‘ఓజీ’ పేరుతో ఆల్రెడీ తిరగరాయబడ్డాయ్.!
చివరగా.. థియేటర్ల బయట బిచ్చమెత్తుకునేవాళ్ళ దగ్గర్నుంచి ఇన్పుట్స్ తీసుకుని రాసే ‘మంకీ’ రివ్యూస్.. ఆన్లైన్లో పైరసీ వీడియో చూసి రివ్యూలు ఇచ్చే ‘గే’టాంధ్ర లాంటి రివ్యూస్, కులజాడ్యంతో రాసే నెగెటివ్ రివ్యూస్.. వీటిని పక్కన పెడితే, రెండున్నర గంటలు నిఖార్సయిన ఎంటర్టైనర్ ‘ఓజీ’ అన్నది నిస్సందేహం.!
