Pawan Kalyan Pant రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏం సాధించాడు.? అన్న ప్రశ్న తరచూ తెరపైకి వస్తోంది రాజకీయ ప్రత్యర్థుల నుంచి.!
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏమీ సాధించకపోతే, ఆయన్ని చూసి ఎందుకు భయపడుతున్నట్లు.? పవన్ కళ్యాణ్ ‘వారాహి’ని చూసి భయపడ్డారెందుకు.?
‘వారాహి’ని చూసి భయపడ్డారు..!
ఆఖరికి పవన్ కళ్యాణ్ ప్యాంటుని చూసి కూడా భయపడతారా.?
ఇదా రాజకీయం.? జనాన్ని ఉద్ధరిస్తామని గద్దెనెక్కి.. ఇదేం ఛండాలం.?
Mudra369
సరే, ‘వారాహి’ వాహనాన్ని చూసి భయపడ్డారంటే ఓ అర్థముంది.! పవన్ కళ్యాణ్ ప్యాంటుని చూసి కూడా భయపడింది ఎందుకు.?
Pawan Kalyan Pant.. మీడియా మరీ దారుణం..
అధికార పార్టీ నేతలు.. అందునా మంత్రులు.. పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనంపై అవాకులు చెవాకులు పేలారు. అడ్డగోలు నిబంధనలూ ప్రస్తావించారు.
చివరికి ఏమయ్యింది.? ‘ఎలా రోడ్ల మీదకు వస్తుందో చూస్తాం’ అన్నోళ్ళు, ‘వచ్చింది, చూశాం..’ అని తోకముడిచేశారు.

హైద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ వెళితే, ఈ క్రమంలో తీసిన ఓ ఫొటోని చూసి, అందులో పవన్ కళ్యాణ్ ధరించిన ప్యాంటుని చూసి కూడా కంగారు పడ్డారు రాజకీయ ప్రత్యర్థులు.
ప్రత్యర్థి మీడియా అయితే, పవన్ కళ్యాణ్ ప్యాంటు మీద కూడా దిక్కుమాలిన కథనాల్ని ప్రచారం చేసే స్థాయికి దిగజారిపోయింది.
పాత్రికేయం అత్యంత నీఛ స్థితికి దిగజారిపోయింది.!
ఓ రాజకీయ నాయకుడి ప్యాంటు మీద డిస్కషన్లు పెట్టడమేంటి.?
పాత్రికేయమా.? పాత్రికేయ వ్యభిచారమా.?
రాజకీయ పార్టీలకు ఊడిగం చేయడమే నయా పాత్రికేయ ధర్మమా.?
మీడియా కాదిది.. పెయిడ్ మాఫియా.!
Mudra369
భయం.. టన్నుల్లో.! ఇదీ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రత్యర్థులకి ఇచ్చింది. సినిమా హీరో పవన్ కళ్యాణ్ స్టైలింగ్ గురించి చర్చ వస్తే.. అది మామూలే.!
Also Read: Rana Naidu: ఆ ‘ఛండాలం’పై రానా దగ్గుబాటి క్షమాపణ.!
పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ ప్యాంటు గురించి కూడా రాజకీయ చర్చ జరగాలా.? అప్పుడెప్పుడో ‘గుడుంబా శంకర్’ సినిమా టైమ్‌లో పవన్ కళ్యాణ్ ధరించిన ‘డబుల్ ప్యాంట్’ ట్రెండింగ్. మళ్ళీ ఇప్పుడిలా.!
పవన్ కళ్యాణ్‌కి.. జనసేన పార్టీకీ.. ఆయన రాజకీయ ప్రత్యర్థులే బ్రాండ్ అంబాసిడర్లు.!