Table of Contents
Pawan Kalyan Pithapuram Welfare.. సినీ పరిశ్రమలో, కొందరు అగ్ర దర్శకులు తమని తాము భక్తులుగా పేర్కొంటుంటారు.. అదీ, పవన్ కళ్యాణ్ అనే తమ దేవుడి గురించి ప్రస్తావిస్తూ.!
‘హీరోలకి అభిమానులంటారు.. పవన్ కళ్యాణ్‌కి భక్తులు వుంటారు’ అని ఓ ప్రముఖ దర్శకుడు పలు వేదికలపై పదే పదే చెప్పడం చూస్తున్నాం.
చాలామంది సినీ అభిమానులు, తమ అభిమాన నటుల్ని దేవుళ్ళతో పోల్చుతారు. కొందరు హీరోయిన్లను దేవతల్లా పూజించి, దేవాలయాలు నిర్మించడం తమిళనాట చూశాం.
Pawan Kalyan Pithapuram Welfare.. పవన్ కళ్యాణ్.. నిజ జీవితంలోనూ దేవుడే.!
అనాధ పిల్లల్ని, దేవుడి పిల్లలుగా భావిస్తూ.. ఆ పిల్లలకి భగవంతుడిలా మారిపోయారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 42 మంది అనాధ పిల్లలకు, నెలకు ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తున్నారు జనసేనాని.
ఈ మేరకు తాజాగా, సెప్టెంబరు నెల మొదటి వారంలో, సుమారు 2 లక్షల రూపాయలను వెచ్చించారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, ఈ మొత్తాన్ని అనాధ పిల్లలకు అందించారు.
ప్రజా ప్రతినిథిగా తన వేతనాన్ని.. అనాధల కోసం వెచ్చిస్తున్న జనసేనాని..
ప్రజా ప్రతినిథులకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుతుంటుంది. అలా పవన్ కళ్యాణ్ తనకు దక్కుతున్న గౌరవ వేతనాన్ని, ఇలా దేవుడి పిల్లల కోసం వెచ్చిస్తుండడం అభినందనీయం.
ఇలా తన గౌరవ వేతనాన్ని, నియోజకవర్గంలోని అనాధ పిల్లల కోసం వెచ్చించడమే కాదు.. సినీ నటుడిగా తన సంపాదన నుంచి కూడా, ప్రజా సంక్షేమం కోసమే చాలా వరకు వెచ్చిస్తున్నారు పవన్ కళ్యాణ్.
ప్రభుత్వం తరఫున విడుదల చేస్తున్న నిథులకు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సంపాదన నుంచి వెచ్చిస్తున్న సొమ్ములు అదనం.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో.. ఆ మాటకొస్తే, దేశ రాజకీయాల్లో.. ఇలా స్వార్జితాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్న రాజకీయ నాయకుడు ఇంకొకరు లేరనడం అతిశయోక్తి కాదు.
సాయం పేరు పవన్ కళ్యాణ్..
విజయవాడలో గతంలో సంభవించిన వరదల నేపథ్యంలో కోట్లాది రూపాయల్ని విరాళంగా పవన్ కళ్యాణ్ అందించిన సంగతి తెలిసిందే.
ఆట స్థలం కావాలని విద్యార్థులు అడిగితే, తన స్వార్జితంతో స్థలం కొనుగోలు చేసి, పాఠశాలకు ఇచ్చిన మానవతావాది పవన్ కళ్యాణ్.

పిఠాపురం నియోజకవర్గంలో, శ్రావణ మాసంలో మహిళల కోసం వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తూ, వారికి ‘పుట్టింటి’ కానుకల తరహాలో, చీర అలానే పసుపు కుంకుమ ఇస్తున్నారు జనసేనాని.
చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే.. వున్నాయ్.! ఒక్కటి మాత్రం నిజం.. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు.!