Home » జనసేనాని పవన్ కళ్యాణ్‌కి పొలిటికల్ ఆక్సిజన్ అదే.!

జనసేనాని పవన్ కళ్యాణ్‌కి పొలిటికల్ ఆక్సిజన్ అదే.!

by hellomudra
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Political Oxygen.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ముగిసిపోయిందన్న ప్రచారం ఈనాటిదే కాదు.! కొత్త సీసాలో పాత సారా.. అన్నట్లు, ఇలాంటి పుకార్లు కొత్త కొత్తగా పుట్టుకొస్తూనే వుంటాయి.

టీడీపీతో జన సేన పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాన్ కెరీర్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందని తలపండిన రాజకీయ విశ్లేషకులు గతంలో వ్యాఖ్యానించారు.

కట్ చేస్తే, ‘ఏ పవన్ నహీ.. ఏ ఆంధీ..’ అంటూ సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ, జన సేనాని పవన్ కళ్యాణ్ గురించి కొనియాడారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం, కూటమి ఐక్యంగా వుండాలి.. అదీ, పదిహేనేళ్ళపాటు.. అని పవన్ కళ్యాణ్ చెబితే, దానికీ పెడార్థాలు తీస్తున్నారు.

Pawan Kalyan Political Oxygen.. 2029 నాటికి పొలిటికల్ ఈక్వేషన్ ఎలా వుంటుందో..

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మలుపులుంటాయో ఎవరూ ఊహించలేరు. 2029 ఎన్నికల నాటికి పొలిటికల్ ఈక్వేషన్ ఎలా అయినా మారొచ్చు.

అయితే, పొత్తు ధర్మంలో భాగంగా, పదిహేనేళ్లపాటు రాష్ట్రం కోసం కూటమి కొనసాగాలి.. అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తుండడాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, సర్జరీ అనంతరం కోలుకున్న పవన్ కళ్యాణ్, జనంలోకి వస్తున్నారు. పార్టీ శ్రేణులతో ఇటీవల భవిష్యత్ రాజకీయంపై దిశా నిర్దేశం చేశారు.

అన్నీ పవన్ కళ్యాణ్‌‌కి తెలుసు..

పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు జన సేనాని పవన్ కళ్యాణ్. పదవుల కోసం కాదు, ప్రజల కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.

అయితే, ముఖ్యమంత్రి పదవి వద్దా.? అంటూ, పవన్ కళ్యాణ్ మీద నెగెటివిటీ షరామామూలుగానే జరుగుతోంది. టీడీపీకి జన సేన ఊడిగం చేస్తోందనే దుష్ప్రచారం షరామామూలుగానే జరుగ8తోంది.

ఎవరేమనుకున్నా, పవన్ కళ్యాణ్ తాను చేయాలనుకున్నది చేస్తారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. కూటమి ఐక్యతను దెబ్బ తీస్తే తప్ప, వైసీపీకి భవిష్యత్తు లేదన్న కోణంలోనే ఈ దుష్ప్రచారమంతా.

పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన వ్యూహాలతో ముందడుగు వేస్తున్నారు. జనసేన శ్రేణులు సైతం, సేనాని వ్యూహాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు.

యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు..

సోషల్ మీడియా, రాజకీయాల్ని శాసించలేదు. రాజకీయ పార్టీలని అసలే శాసించలేదు. కాకపోతే, ఈ చికాకులు జన సేన పార్టీకి సంబంధించి కొందరు సన్నిత మనస్కులైన కార్యకర్తల్ని ఇబ్బంది పెడతాయంతే.

అదే సమయంలో, ఈ నెగెటివిటీ ఇంకో కోణంలో జన సేన పార్టీకి అదనపు ఆక్సిజన్ అందిస్తుంది. ఎంత నెగెటివిటీ జన సేన మీద సృష్టిస్తే, జన సేన అంతలా బలపడుతుంది.

రాజకీయ ప్రత్యర్థులు నెత్తీనోరూ బాదుకోవడమే జన సేన పార్టీకి, జన సేనాని పవన్ కళ్యాణ్‌కీ ఆక్సిజన్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group