Pawan Kalyan Sikh Attire.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్రలోని నాందేడ్‌లో తేగ్ బహదూర్ సింగ్ షాహిది సమాగమంలో పాల్గొన్నారు.!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పవిత్ర చాదర్‌ని సమర్పించారు జన సేనాని పవన్ కళ్యాణ్.
కాగా, పవన్ కళ్యాణ్‌కి అక్కడి ప్రముఖులు, సిక్కు మత పెద్దలు తమ సంప్రదాయం ప్రకారం, పవిత్ర వస్త్రాన్ని అందజేశారు, గౌరవ పూర్వకంగా తల పాగా చుట్టారు.
సిక్కుల పవిత్ర ఆయుధం కిర్పాన్‌ని కూడా పవన్ కళ్యాణ్‌కి బహూకరించారు.
అయితే, పవిత్ర సిక్కు తల పాగా విషయంలో, వైసీపీ సోషల్ మీడియా విభాగం, మరీ ముఖ్యంగా వైసీపీ పెయిడ్ బ్యాచ్ చిత్రంగా పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ చేయడం గమనార్హం.
దర్గాలను సందర్శించే క్రమంలో ముస్లిం మత పెద్దలు, సినీ రాజకీయ ప్రముఖులకు.. సంప్రదాయ ఇస్లాం వస్త్రధారణకు సంబంధించి టోపీ, టవల్ వంటివి ధరింపజేస్తుంటారు.
సిక్కు మతానికి సంబంధించిన పవిత్ర ప్రార్థనా స్థలాలకు వెళితే, ప్రముఖుల్ని వారి సంప్రదాయం ప్రకారం గౌరవించడం సర్వసాధారణం.
పవన్ కళ్యాణ్ విషయంలో కూడా జరిగింది అదే.! కానీ, పగటి వేషగాడు.. అంటూ, పవిత్ర సిక్కు తలపాగా ధరించిన పవన్ కళ్యాణ్ మీద అభ్యంతకర కామెంట్స్ చేయడం దురదృష్టకరం.
ఏ మత విశ్వాసాలపైనా వైసీపీకీ, వైసీపీ మద్దతుదారులకీ అస్సలేమాత్రం గౌరవం లేకుండా పోయిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా గతంలో సిక్కు మత ప్రముఖులు సన్మానించారు. ఆ క్రమంలో, వారి సంప్రదాయ వస్త్రధారణకు సంబంధించిన తల పాగా లాంటిది ధరింపజేశారు.
అంటే, ఇక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా పగటి వేషగాడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందా.? అన్న ప్రశ్నకి సమాధానం ఎవరు చెబుతారు.?
వైసీపీకి వేరే శతృవులు అక్కర్లేదు.! రాజకీయంలోకి మతం కోణాన్ని లాగడం, ఏ మతాన్నీ గౌరవించకపోవడం.. ఇదేం పద్ధతి.?
పవన్ కళ్యాణ్ సిక్కు తల పాగా విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. యావత్ సిక్కు సమాజం, వైసీపీ తీరుని తప్పుపడుతోంది.
