Pawan Kalyan Tamilnadu Politics.. సనాతన ధర్మానికి సంబంధించి గతంలో సినీ నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (ప్రస్తుతం తమిళనాడు ఉప ముఖ్యమంత్రి) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఆ వ్యాఖ్యలపై ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తిరుపతిలో నిర్వహించిన ‘వారాహి డిక్లరేషన్’ సభలో కౌంటర్ ఎటాక్ చేశారు.. అదీ, ఉదయనిధి స్టాలిన్ పేరుని ప్రస్తావించకుండానే.
ఈ క్రమంలో తమిళనాడులోని డీఎంకే మద్దతుదారుడైన ఓ న్యాయవాది, మధురైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
మరోపక్క, డీఎంకే సోషల్ మీడియా వింగ్స్, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ, జుగుప్సాకరమైన ట్రోలింగ్ మొదలు పెట్టాయి.
Pawan Kalyan Tamilnadu Politics.. తమిళ రాజకీయాలతో పవన్ కళ్యాణ్‌కి ఏంటి సంబంధం.?
ఇంతకీ, తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి.? పవన్ కళ్యాణ్ ఎందుకు ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ గురించి సానుకూలంగా ట్వీట్ వేసినట్లు.?
తమిళనాడులో త్వరలో జరగబోయే (2026లో) జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఏడీఎంకే – బీజేపీ మధ్య పొత్తు, అదే బీజేపీతో తెలుగు రాష్ట్రాల్లో పొత్తులో వున్న జనసేన.. ఈ నేపథ్యంలో ఒకింత ఆసక్తికరమైన విశ్లేషణలు కనిపిస్తున్నాయ్.

ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ – బీజేపీ కలవడానికి కారణం జనసేన. తమిళనాడులో ఆల్రెడీ ఏఐఏడీఎంకే – బీజేపీ కలిసి పనిచేస్తున్నాయ్. ఆ బంధం, పవన్ కళ్యాణ్ వల్ల ఇంకాస్త బలపడుతుందా.? అంతేనేమో.!
ఏఐఏడీఎంకే కూడా, పవన్ కళ్యాణ్‌కి థ్యాంక్స్ చెప్పింది.. ఆయన వేసిన ట్వీట్‌కి స్పందిస్తూ. అదే సమయంలో, డీఎంకే నుంచి పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న ట్రోలింగ్‌కి ఏఐఏడీఎంకే మద్దతుదారులు కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు.
సన్నిహిత సంబంధాలున్నాగానీ..
సినీ నటుడిగా పవన్ కళ్యాణ్‌కి తమిళనాట కూడా చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ వుంది. తమిళనాడుకి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పవన్ కళ్యాణ్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి కూడా.
సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం, తమిళనాడులోని హిందువుల్ని సైతం ఆకట్టుకుంది. అక్కడా ఈ విషయమై ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది.

తెలిసో తెలియకో.. డీఎంకే, తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ని సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మార్చేస్తున్న వైనం.. అక్కడి రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది.
పవన్ కళ్యాణ్, కొంత కాలం పాటు చెన్నయ్‌లో వున్నారు.. తమిళంలో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు.. పైగా, బీజేపీతో ఆయన పొత్తులో వున్నారు. ఇప్పుడు ఏఐఏడీఎంకే కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తోంది.
Also Read: సింగిల్ సింహం.! ఎంత నిజం.?
ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల జోలికి వెళ్ళకపోవచ్చు. కానీ, ఆయన ఇంపాక్ట్ మాత్రం తమిళ రాజకీయాలపై ఈసారి గట్టిగానే వుండబోతోంది. అదెంత.? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
రాజకీయం ఎప్పుడూ ఒకేలా వుండదు.! అందుకే, పవన్ కళ్యాణ్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. అన్ని విషయాలపైనా సంపూర్ణ అవగాహనతో ముందుకు నడుస్తున్నారు.