Pawan Kalyan Varahi Deeksha.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, ‘వారాహి’ దీక్ష చేపట్టారు.
‘వారాహి’ అమ్మవారి పేరుతోనే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan) రాజకీయ ప్రచార రధాన్ని గతంలో తయారు చేయించుకున్న సంగతి తెలిసిందే.
కానీ, ఆ ‘వారాహి’ (Varahi) వాహనంపై అప్పటి అధికార వైసీపీ నేతలు అత్యంత అసభ్యకరమైన రీతిలో రాజకీయ విమర్శలు చేశారు.
Pawan Kalyan Varahi Deeksha.. వాళ్ళందర్నీ పాతాళానికి తొక్కేసిన ‘వారాహి’.!
ఎలా ఆ ‘వారాహి’ వాహనం ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతుందో చూస్తామంటూ మీసం మెలేసినోళ్ళు, తొడ కొట్టినోళ్ళు కూడా వున్నారు. వారిలో మంత్రులూ వున్నారండోయ్.!
ప్చ్.. ఒక్కొక్కడ్నీ ‘వారాహి’ (Varahi) రాజకీయంగా అదఃపాతాళానికి తొక్కేసినట్లయ్యింది ఇటీవల వెల్లడయిన ఎన్నికల ఫలితాలతో.
Also Read: చిరంజీవిని చూసి మొరిగితే, చిరంజీవికి చేటా.?
ఇదిలా వుంటే, ఎన్నికల్లో తమ పార్టీకి ఘన విజయం దక్కిన దరిమిలా, జన సేనాని పవన్ కళ్యాణ్ భక్తి శ్రద్ధలతో ‘వారాహి అమ్మవారి దీక్ష’ (Varahi)ను ప్రారంభించారు.
11 రోజులపాటు ఈ దీక్ష కొనసాగుతుందిట. ఆహారంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan).
‘వారాహి’ అంటే అమ్మవారు.. దేవత.. అన్న కనీసపాటి ఇంగితం లేకుండా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అదఃపాతాళానికి తొక్కివేయబడిందన్నది అంతటా వినిపిస్తోన్న అభిప్రాయం. దీన్నే దుష్ట శిక్షణ అంటారు.!
Mudra369
కాగా, గత ఏడాది జూన్ నెలలో ‘వారాహి’ యాత్రను చేపట్టారు జనసేనాని. ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు.
మరోపక్క, డిప్యూటీ సీఎం హోదాలో, ‘వారాహి’ వాహనంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని (Jana Sena Party Chief Pawan Kalyan) చూడాలని జనసేన శ్రేణులు ఆశిస్తున్నాయి.