Table of Contents
Pawan Kalyan With Farmers.. పది మందికి అన్నం పెట్టే రైతన్న, పూట గడవక బలవన్మరణాలకు పాల్పడుతున్న రోజులివి.!
నానా తంటాలూ పడి పంట పండించినా, ఆ పంట చేతికొస్తుందో లేదో తెలియని దుస్థితి. ఓ వైపు తెగుళ్ళు, ఇంకో వైపు ప్రకృతి విపత్తులు.. రైతుల్ని నిలువునా ముంచేస్తున్నాయి.
మనది వ్యవసాయాధారిత దేశం.! వ్యవసాయం కోసం ప్రభుత్వాలు వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేస్తుంటాయ్. కానీ, రైతుల జీవితాలు బాగుపడటంలేదు.
రైతులు, వ్యవసాయం.. వీటితో పొలిటికల్ పార్టీలు, రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ‘డ్రామా’ పండిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Pawan Kalyan With Farmers.. రైతు గుండెల్లో తుపాను..
మొన్నటికి మొన్న మొంథా తుపాను వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా పంట నష్టం అంచనాలకు మించి జరిగింది. ప్రభుత్వం, రైతుల్ని ఆదుకుంటామంటూ ఇప్పటికే ప్రకటన చేసింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నేరుగా రైతుల దగ్గరకు వెళ్ళారు. పంట నష్టాన్ని పరిశీలించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులతో మాట్లాడారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, మోకాలి లోతు వరద నీటిలో పంట పొలాల్ని పరిశీలించడం గమనార్హం. సహజంగానే, పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయ విమర్శలకు కారణమైంది.
రాజకీయ విమర్శ.. అనడం కంటే, పనిగట్టుకుని చేసే దుష్ప్రచారం.. అనడం సబబేమో.! ఎందుకంటే, వ్యవసాయం అంటే పవన్ కళ్యాణ్‌కి మక్కువ ఎక్కువ.
ఆయనే ఓ రైతు…
సొంత వ్యవసాయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్, రకరకాల పంటలు పండిస్తుంటారు. పవన్ కళ్యాణ్ వ్యవసాయం మీద ఎవరెన్ని వెటకారాలు చేశారో, చేస్తున్నారో.. చూస్తూనే వున్నాం.
ఓ రైతు కష్టం, మరో రైతుకే తెలుస్తుందన్నట్లు, పవన్ కళ్యాణ్.. రైతుల కష్టాల్ని అర్థం చేసుకున్నారు. దీర్ఘకాలంగా రైతలు ఎదుర్కొంటున్న సమస్యలూ పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి.

అయితే, ‘పవన్ కళ్యాణ్ లెగిన్ వేసుకున్నారు.. షర్టుకి మైక్ పెట్టుకున్నారు.. షూటింగుకి వెళ్ళారు..’ అంటూ, సోషల్ మీడియా వేదికగా బాధ్యతారాహిత్యంతో కూడిన విమర్శల్ని చూస్తున్నాం.
నిజానికి, పవన్ కళ్యాణ్ పంట పొలాల్లోకి దిగాల్సిన అవసరం లేదు. గట్టు మీదనే, రైతులతో మాట్లాడొచ్చు. కానీ, స్వతహాగా వ్యవసాయం అంటే, పవన్ కళ్యాణ్‌కి ఇష్టం కదా.!
అప్పుడూ.. ఇప్పుడూ రైతుల పక్షమే…
అధికారంలో లేనప్పుడూ, రైతుల తరఫునే పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు, స్వార్జితం నుంచి సాయం అందించారు పవన్ కళ్యాణ్.
Also Read: విశాఖపైనా, గూగుల్‌పైనా విషం చిమ్ముతున్న వైసీపీ.!
ఇలాంటి విషయాల్లో ఫక్తు రాజకీయ విమర్శలు చేసే ముందు, పవన్ కళ్యాణ్ అంటే ఏంటి.? అని తెలుసుకోవడం మర్చిపోకూడదు ఎవరైనా.!
