Table of Contents
Pawan Kalyan Ys Jagan Dattaputrudu.. ఎవరు అసలు పుత్రుడు.? ఎవరు దత్త పుత్రుడు.?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొత్తులు పెట్టుకుంటేనే దత్త పుత్రులైపోతే, రాజకీయాల్లో అందరూ దత్త పుత్రులే అవుతారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys Raja Sekhar Reddy)కూడా కాంగ్రెస్ పార్టీకో, ఇంకో పార్టీకో దత్త పుత్రుడే అనుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంది.
రాజకీయం అంటేనే పొత్తులతో ముడిపడి వున్న వ్యవహారం. చిన్న పార్టీలతోనో, పెద్ద పార్టీలతోనూ పొత్తులే లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యం కాదు. అధికారికమో, అనధికారికమో.. అంతే తేడా.!
Pawan Kalyan Ys Jagan Dattaputrudu రాష్ట్ర సమస్యా ఇది.?
అంశాల వారీగా కేంద్రంలోని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ప్రభుత్వానికి వైసీపీ మద్దతిస్తోందంటే, బీజేపీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దత్త పుత్రుడనే కదా అర్థం.. ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శల తీరుని బట్టి.!
ఫక్తు రాజకీయ నాయకులు వేరు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) వేరు. ఆయన ఇంతవరకు ఏ చట్ట సభకూ ప్రాతినిథ్యం వహించలేదు.
పవన్ కళ్యాణ్ రాజకీయ అవినీకి పాల్పడలేదు. అక్రమాస్తుల కేసులనో, ఇంకో అవినీతి అనో ఆయన జైలుకెళ్ళలేదు, అలాంటి కేసులేవీ పవన్ కళ్యాణ్ మీద లేవు. మరెలా పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడవుతాడు.?
కౌంటర్ ఎటాక్ మరీ ఇంతలాగానా.?
పవన్ కళ్యాణ్ మీద దత్త పుత్రుడనే విమర్శలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేలిగ్గా చేసేస్తున్నారుగానీ, దానికి కౌంటర్ ఎటాక్‌గా వస్తున్న ‘జైల్ రెడ్డి.. బెయిల్ రెడ్డి.. సీబీఐ దత్త పుత్రుడు.. రాజన్న చెత్త పుత్రుడు.. శవ పుత్రుడు..’ అనే విమర్శల్ని పరిగణనలోకి తీసుకోకపోతే ఎలా.?

ఎవరు రాసిచ్చిన స్క్రిప్టోగానీ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YSR Congress Party Chief Ys Jagan Mohan Reddy) తన స్థాయికి తగని మాటల్ని చదువుతున్నారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న ఓ విమర్శ.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడా.? కాదా.? అన్నది అసలిప్పుడు రాష్ట్రానికి, రాష్ట అభివృద్ధికి సంబంధించి ‘అవసరమైన’ అంశం కానే కాదు.
ముఖ్యమంత్రిగా మూడేళ్ళలో ఏం చేశారు, రానున్న రెండేళ్ళలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister Ys Jagan Mohan Reddy) ఏం చేస్తారు.? అన్నదాని గురించే రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తారు.
రాష్ట్రం పట్ల బాధ్యత వుండాలి కదా.!
ప్రత్యేక హోదా (Andhra Pradesh Special Status) తెస్తారా.? లేదా.? మాట ఇచ్చారు గనుక, సీపీఎస్ రద్దు చేస్తారా.? చెయ్యరా.? రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయా.? రావా.? ఇవీ చర్చనీయాంశాలు కావాల్సింది.
Also Read: పవన్ కళ్యాణ్ వేళ్ళకున్న ఉంగరాల్లో ఏ రహస్యం దాగుందంటే.!
అంతే తప్ప, ‘పుత్రోత్సాతం’ సృష్టిస్తూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan) డైవర్షన్ రాజకీయాలు చేస్తే.. నష్టపోయేది రాష్ట్ర ప్రజలే.