Pawan Komatireddy Kobbari Dishti.. కీలక పదవుల్లో వున్న వ్యక్తులు, ఇంత హుందాగా వ్యవహరిస్తే ఎంత బావుంటుందో కదా.!
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని విజయవాడలో కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ సఖ్యతగా కలిసి మెలిసి వుండాలని ఆకాంక్షించారు.
రాజకీయాల సంగతి తర్వాత, ముందైతే ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా వున్నవారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి మెలిసి వుంటే, ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలకూ అవకాశం వుండదు.
పవన్ కళ్యాణ్ మీద ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.? ఎందుకు ఆయన మాటల్ని వక్రీకరించారు.? అంటే, ఏదో అలా అనేశాను.. ఇప్పుడైతే అన్నీ క్లియర్.. అని తేల్చేశారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి.
Pawan Komatireddy Kobbari Dishti.. వక్రీకరించారు.. తప్పు తెలుసుకున్నారు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కోనసీమ కొబ్బరి విషయమై చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యల్ని, తెలంగాణ నాయకులు కొందరు వక్రీకరించారు.
అలా వక్రీకరించిన నాయకుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి వరసలో వున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్ని తెలంగాణలో రిలీజ్ కానివ్వను.. అని ప్రకటించేశారాయన.

‘సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో విడుదల కానివ్వను’ అని కుండబద్దలుగొట్టేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
కాంగ్రెస్ నాయకులు చాలామంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే ఘాటుగా, పవన్ కళ్యాణ్‌ని విమర్శించేశారు. బీఆర్ఎస్ నాయకులూ వంత పాడారు.
కామెడీగా సీరియస్ పొలిటీషియన్ కవిత కూడా..
‘సీరియస్ పొలిటీషియన్’ కవిత కూడా కామెడీగా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిపోవడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో ట్విస్ట్.!
కట్ చేస్తే, వివాదం సద్దుమణిగిపోయింది.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ పర్యటనతో. మంచిదే కదా.! తెలుగు రాష్ట్రాల మధ్య వుండాల్సింది ఈ స్నేహపూర్వక వాతావరణమే.

ఆవేశకావేశకాల్లో విజ్ఞత మరిచి, ఏదేదో మాట్లాడేసినప్పుడు.. సోయ వచ్చాక, వివాదానికి ముగింపు పలకాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసింది అదే.
Also Read: రాత్రికి రాత్రే 240 కోట్లు కొల్లగొట్టేశాడు.!
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమీ అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదు. ఆ విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అర్థమయ్యింది.. ఆహ్వానించదగ్గ విషయమే ఇది.
ఇంతకీ, పానకంలో పుడకల్లా ఈ వ్యవహారంలోకి దూరిన వైసీపీ నాయకులు, వైసీపీ క్యాడర్ పరిస్థితేంటి.? ప్చ్.. ఇంకోసారి గొర్రెల్లా మిగిలిపోయారంతే.!
