Table of Contents
Pawanism Pawan Kalyan Heroism.. సినిమాల్లో హీరో ఎలా వుండాలి.? అంటే, దానికి ఇదమిద్ధమైన కొలమానాలంటూ ఏమీ వుండవు. మాస్ హీరో లెక్క ఒకలా వుంటుంది.. ఫ్యామిలీ సినిమాల హీరో లెక్క ఇంకోలా వుంటుంది. క్లాస్ సినిమాల హీరో ఈక్వేషన్ మరోలా వుంటుంది.
నిర్మాత ఓ హీరోతో సినిమా చేయాలనుకున్నప్పుడు, ఆ హీరోని ఎలా చూపిస్తే ప్రేక్షకులు తన సినిమాని విజయవంతం చేస్తారన్న కోణంలో ఆలోచన సాగుతుంది. దర్శకుడు, కథా రచయిత, మాటల రచయిత.. ఇలా అందరూ కలిసి కూర్చుని వర్కవుట్ చేస్తారు.
అలా, సినిమాల్లోని పాత్రలకు తొలుత ఓ షేప్ వస్తుంటుంది. రుచికరమైన వంటకం కోసం ఎలాగైతే అన్ని దినుసులూ సక్రమంగా వాడాలో, సినిమా కోసం కూడా అన్ని కమర్షియల్ అంశాలూ సరిగ్గా చూసుకోవాల్సిందే. అన్నీ పక్కాగా కుదిరినా, రిలీజ్ టైమ్ సహా అనేక అంశాలు సినిమా ఫలితంపై ప్రభావం చూపుతాయి.
ఎంత ’మేతా‘వితనం సుమీ.!
ఇప్పుడిదంతా ఎందుకంటే, పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా గురించి రకరకాల పోస్టుమార్టమ్‌లు జరుగుతున్నాయి. సినీ పరిశ్రమలో ఇంకెవరికీ జరగనంత యాగీ పవన్ కళ్యాణ్ సినిమాల చుట్టూ జరుగుతుంటుంది. కులగజ్జి కారణమా.? ఇంకేదైనా వ్యక్తిగత ద్వేషం ఆయన మీద వుంటుందా.? అన్నది వేరే చర్చ.

జనోద్ధారకుడిగా పవన్ కళ్యాణ్‌ని చూపించేందుకు దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారట.. అలా వారిపై పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెస్తున్నారట. ఇదీ ‘భీమ్లానాయక్’ పోస్టుమార్టమ్ ద్వారా ఓ మేధావి తేల్చిన విషయం.
‘వకీల్ సాబ్’ సినిమాని కూడా ప్రస్తావనకు తెచ్చాడా ‘గ్రేట్’ మేతావి. ఏడవడంలో పీహెచ్డీ చేసేసిన ఇలాంటోళ్ళు చాలామందే కనిపిస్తారనుకోండి.. అది వేరే సంగతి.
Pawanism Pawan Kalyan Heroism.. పవర్‌ఫుల్ పాత్రల్లో నటిస్తే నేరమా.?
‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడు. అంతెందుకు, ముఖ్యమంత్రి పాత్రల్లో చాలామంది హీరోలు కనిపించారు. అంతమాత్రాన, ఆయా హీరోలు తమను జనోద్ధారకులుగా చూపించాలంటూ దర్శకుల మీదనో, నిర్మాతల మీదనో ఒత్తిడి తెచ్చినట్లవుతుందా.?
పవన్ కళ్యాణ్ ఏంటి.? ఆయన వ్యక్తిత్వం ఏంటి.? కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించినప్పుడు.. ముందూ వెనుకా ఆలోచించకుండా తన సంపాదనలో మెజార్టీ భాగాన్ని రాసిచ్చేశారాయన.
Pawanism Pawan Kalyan Heroism.. విపత్తుల వేళ పవర్ హీరోయిజం.!
అంతే కాదు, వరదలొచ్చినా, ఇతర విపత్తులు ఏవన్నా వచ్చినా, ప్రజల్ని ఆదుకునేందుకుగాను తనవంతుగా అందరికంటే ముందు విరాళాల్ని ప్రకటిస్తుంటారు పవన్ కళ్యాణ్.
Also Read: గోతికాడి నక్కలకి గూబ గుయ్యమంది ‘బాస్’.!
సమాజం తనను హీరోని చేస్తే, ఆ సమాజం ద్వారా సాధించిన డబ్బు, పేరు ప్రఖ్యాతుల్ని తిరిగి సమాజం కోసం ఉపయోగించాలని పవన్ కళ్యాణ్ అనుకోవడం తప్పెలా అవుతుంది.? సరే, మిగతా హీరోలూ తమవంతుగా విరాళాలు ప్రకటించడం, ఇతరత్రా సేవా కార్యక్రమాలు చేస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.
ఏడవడమొక్కటే వ్యాపకం.!
పవన్ కళ్యాణ్ సినిమా ఏదన్నా వస్తోందంటే, ‘ఏడుపు బృందం’ ముందస్తుగా సమాయత్తమయిపోతుంటుంది. ఆయా చిత్రాల నిర్మాణ సంస్థలు చేపట్టే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల సంగతెలా వున్నా, పవన్ కళ్యాణ్ వ్యతిరేక వర్గం.. పెద్ద మొత్తంలో వెచ్చించి మరీ, పవన్ కళ్యాణ్ మీద అభ్యంతకరమైన కథనాల్ని వండి వడ్డిస్తుంటాయి.
ఒక వ్యక్తి మీద ఇంత ద్వేషమా.? చరిత్రలో కనీ వినీ ఎరుగని పైత్యమిది.! అయినాగానీ, పవన్ కళ్యాణ్ కాలి చిటికెన వేలు మీద వెంట్రుకైనా కదలదు.. ఈ చెత్త కథనాల, చెత్త ప్రచారాల పైత్యంతో.