Pawankalyan Sreeleela Ustaad Bhagatsingh.. ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ కస్తూరి శ్రీలీల. తొలి సినిమా ఫ్లాప్ అయినా అమ్మడు తెలుగు తంబీల్ని బాగా ఇంప్రెస్ చేసింది.
అందంతో, తనదైన డాన్సింగ్ స్టైల్‌తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసింది. దాంతో, టాలీవుడ్‌లో అమ్మడికి అవకాశాలు పోటెత్తుతున్నాయ్.
అన్నీ క్రేజీ ఆఫర్లే. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా శ్రీలీల మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో.
Pawankalyan Sreeleela Ustaad Bhagatsingh.. ‘పవర్’ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.!
ఇటీవల మాస్ రాజా రవితేజతో నటించిన ‘ధమాకా’ శ్రీలీలకి మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలో నటిస్తోంది.
అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో శ్రీలీల బాలయ్యకు కూతురుగా నటిస్తోంది. అలాగే, త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమాలోనూ శ్రీలీల ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.
తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ శ్రీలీల తలుపు తట్టింది. ఈ సారి అలా ఇలా కాదు.. ఏకంగా పవర్ స్టేషన్‌నే టచ్ చేసింది శ్రీలీల. అదే పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.

ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట పూజా హెగ్దేని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయ్. ఆ ప్లేస్‌ని శ్రీలీల తన్నుకెళ్లిపోయింది.
శ్రీలీల జోరు మామూలుగా లేదుగా.!
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని హై ఓల్టేజ్ ఎనర్జీతో చూపించబోతున్నాడట. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ కూడా చాలా ఎనర్జిటిక్‌గా వుండబోతోందట.
అంత ఆసక్తికరంగా నడిచే ఈ ట్రాక్‌లో శ్రీలీల వంటి హీరోయిన్ అయితే బాగుంటుందని ఆమెని ఫైనల్ చేశారట. నిజమే.! శ్రీలీల హై ఓల్టేజ్ ప్యాకేజీనే.
Also Read: Mamta Mohandas: నాగార్జున వల్లే బతికి బయటపడ్డా.!
అసలే హీరోయిన్స్‌ని అందంగా చూపించడంలో హరీష్ శంకర్ దిట్ట. అలాంటి డైరెక్టర్ చేతిలో శ్రీలీల పడితే.. పండగే మరి. అటు ఫ్యాన్స్‌కీ ఇటు హీరోయిన్‌గా శ్రీలీల కెరీర్‌కీ కూడా.
ఇంత త్వరగానే పవన్ కళ్యాణ్ పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుందంటే శ్రీలీల లక్ మామూలుగా లేదు. మొత్తానికి పాప జోరు చూస్తుంటే, అతి త్వరలోనే స్టార్ ఇమేజ్ దక్కించేసుకోవడం ఖాయమనిపిస్తోంది.