Peddi Dheenekka Janhvi Kapoor.. ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాలో రికార్డుల హోరెత్తిస్తోంది.!
మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది పెద్దిగాడి ‘చికిరి చికిరి’ సాంగ్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేశాడు.
రామ్ చరణ్ మాస్ స్టైలింగ్‌కి తోడు, జాన్వీ కపూర్ హాట్ హాట్ అందాల ఆరబోత.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
తెలుగులో జాన్వీ కపూర్‌కి ఇది రెండో సినిమా. ఇంతకు ముందు ‘దేవర’ సినిమాతో తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్.
‘దేవర’ సినిమాలో కూడా, జాన్వీ కపూర్ కేవలం గ్లామర్ షోకి మాత్రమే పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. మరి, ‘పెద్ది’ సినిమాలో ‘అచ్చియ్యమ్మ’ సంగతేంటి.?
Peddi Dheenekka Janhvi Kapoor.. దీనెక్క.. సబబేనా.?
అసలే, జాన్వీ కపూర్ గ్లామర్ షో మీద ‘దేవర’ సినిమా నుంచీ విమర్శలు పోటెత్తుతూనే వున్నాయి. దానికి కొనసాగింపులా తయారైంది ‘పెద్ది’లో ఆమె గ్లామర్.!
పైగా, లిరిక్స్‌లో ‘దీనెక్క’ అనే ప్రస్తావన మరీ అసభ్యకరంగా వుందన్న చర్చ అంతటా జరుగుతోంది. ‘దీనెక్క’ స్థానంలో ‘ఎంచక్కా’ అనే పదాన్ని వాడి వుంటే బావుండన్నది యునానిమస్ అభిప్రాయం.
ఆ చంద్రుల్లో ముక్క..
జారిందే దీనక్క..
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
మాస్ యాంగిల్లోనో, ఇంకో కోణంలోనో.. ‘దీనెక్క’ అనే పదాన్ని లిరిక్ రైటర్ ఉపయోగించి వుండొచ్చుగాక. కానీ, ఆ ఒక్కటీ పాట మీద నెగెటివ్ కామెంట్స్‌కి ఆస్కారమిస్తోంది.
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
మొన్నామధ్య రవితేజ సినిమాలోని పాట ఒకటి అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆ పాటలోని దిక్కుమాలిన పదాల ప్రస్తావనని రవితేజ చిత్రంగా సమర్థించుకున్నాడు కూడా.
గతంలో, పాటల లిరిక్స్‌ని చివరి నిమిషంలో మార్చుకున్న సందర్భాలూ వున్నాయ్. మరి, ‘పెద్ది’ టీమ్, ‘దీనెక్క’ స్థానంలో, ‘ఎంచక్కా’ పదాన్ని ‘చికిరి చికిరి’ పాట కోసం మార్చుతుందా.?
వేచి చూడాల్సిందే.!
