Pithapuram Janasena Vs Varma.. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి, ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేసిన దరిమిలా, అవకాశం దక్కని ఆయా పార్టీలకు చెందిన నేతల్లో కొంత అసంతృప్తి వుండడం సహజం.
అయితే, ఎన్నికలు జరిగిపోయిన తర్వాత కూడా అసంతృప్తి అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. పిఠాపురంలో టీడీపీ నేత నుంచి, జనసేన అధినేతకు తలనొప్పులు తప్పడం లేదు.
Pithapuram Janasena Vs Varma.. పిఠాపురంలోనే ఎందుకీ లొల్లి.?
ఇదే తలనొప్పి, మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ వుంటే ఏంటి పరిస్థితి.? టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట, జనసేన క్యాడర్ ‘లొల్లి’ పెడితే ఎలా వుంటుంది.?
టీడీపీ నేత వర్మ, తన ఉనికి కోసం ప్రయత్నిస్తే తప్పు లేదు. ఆ పోరాటం, టీడీపీ అధినాయకత్వంతో చేయాలి. ఎమ్మెల్సీ పదవే తెచ్చుకుంటారో, మంత్రి పదవే తెచ్చుకుంటారో.. టీడీపీతో తేల్చుకోవాలి.

అంతేగానీ, జనసేన మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది.?
వాస్తవానికి, పవన్ కళ్యాణ్ పక్కనే వుంటూ, కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, తెరవెనుక వర్మ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న అనుమానాలున్నాయి.
అయినప్పటికీ కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏనాడూ వర్మ మీద మాట తూలింది లేదు.
టార్గెట్ పవన్ కళ్యాణ్..
రోజురోజుకీ, పవన్ కళ్యాణ్ మీద వర్మ దిక్కుమాలిన రాజకీయం ముదిరి పాకాన పడుతున్న దరిమిలా, జనసేన శ్రేణులు అసహనానికి గురవుతున్నాయి.
టిక్కెట్ దక్కలేదని తెలిశాక, టీడీపీ అధినాయకత్వం మీద తన అనుచరులతో బూతులు తిట్టించిన ఘనత వర్మది. అందుకే, వర్మని టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ సీటు విషయమై లైట్ తీసుకుంది.

ఈ పరిస్థితుల్లో వర్మ, వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారంలో ఎంతో కొంత వాస్తవం వుండే వుంటుంది. కాకపోతే, వీలైనంత డ్యామేజ్ కూటమికి చేయాలన్న కుట్రతో వర్మ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read: అక్కు పక్షీ.! విమానాల్ని ఎందుకు కూల్చేస్తున్నావ్.?
అయినా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని లొల్లి, పిఠాపురం నియోజకవర్గంలోనే ఎందుకు.? అన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్.
పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని కొన్ని అరాచక రాజకీయ శక్తుల కుట్రలోనే భాగంగా ఇదంతా జరుగుతోందా.? అంతేేనేమో.!