Political Egg Puff.. అధికారమెందుకు.? అడ్డంగా దోచెయ్యడానికి.! ఔను, కొందరు రాజకీయాల్లోకి వస్తున్నది దోచుకోవడానికే మరి.!
ఓ రాజకీయ పార్టీ అధినేత, అధికార పీఠమెక్కాక.. జస్ట్ ఐదేళ్ళలో ఏకంగా మూడున్నర కోట్ల రూపాయల విలువైన ‘ఎగ్ పఫ్’లు తినేశాడట.!
మామూలుగా అయితే, భూముల్ని మింగేయడం చూస్తుంటాం.. కానీ, ఎగ్ పఫ్‌ల కోసం కక్కుర్తి పడటమేంటబ్బా.? నవ్విపోదురుగాక.. రాజకీయ నాయకులకేటి సిగ్గు.?
Political Egg Puff.. ము.. కింద ముప్ఫయ్యారు కేసులు..
అసలు క్రిమినల్స్‌ని ప్రజలు రాజకీయాల్లో ఎలా ఆదరిస్తున్నట్లు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. నేర చరిత్ర కలిగినవాడు, చట్టాలు చేస్తే.. అవి ప్రజా కంటక పాలన అవుతుందని ప్రజలు తెలుసుకోకపోతే ఎలా.?
అయినా, దోచుకుంటే తప్పేంటి.? ఔను, రాజకీయాలంటేనే దోపిడీ.! ఎన్నికల వేళ ఓటర్లను డబ్బుతో రాజకీయ పార్టీలు కొనేస్తున్నాయ్ కదా.!
సో, ప్రజలూ అవినీతిపరులే.. కాబట్టే, క్రిమినల్స్ రాజకీయాల్ని ఏలేయగలుగుతున్నారు.
సొంతంగా జేబులోంచి పాతిక రూపాయలు తీసి.. ఎగ్ పఫ్ కూడా కొనుక్కుని తినలేనోడు.. ‘మీ బిడ్డ’ అంటూ ఆడి పేరుని సంక్షేమ పథకాలకు పెట్టుకుని.. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు.
Mudra369
కూసింత దూరానికి హెలికాప్టర్ ప్రయాణాలు.. ప్రత్యేక విమానాల్లో దర్జాలు.. ఇవన్నీ ఊరకే వస్తాయా.? ప్రజాధనం కదా, అందినకాడికి అడ్డగోలుగా వృధా చేసెయ్యడమే.
ఇంతే కదా, అధికారమంటే.? ఇంతకన్నా ఇంకేముంటుంది.? ‘బటన్ నొక్కుతున్నాం కదా..’ అనే భ్రమల్లో రాజకీయ నాయకులు ఎక్కువ కాలం వుండలేరు.
ఓటర్లూ నొక్కుతారు బటన్.! ఆ దెబ్బకి రాష్ట్రం విడిచి భవిష్యత్తు మీద ‘బెంగ’తో వేరే రాష్ట్రానికి దొంగలా పారిపోవాల్సి వస్తుంది.!