Political Konda Erripappa.. కామెడీ షోస్ కారణంగా ‘ఎర్రి పప్ప’ అన్న మాట సర్వసాధారణం అయిపోయిందిగానీ, అది అసలు మామూలు తిట్టు కాదు.! పచ్చి బూతు.!
నిస్సిగ్గుగా కామెడీ షోస్‌లో ఆ ‘ఎర్రి పప్ప’ అనే బూతు తిట్టుని ఫిమేల్ కమెడియన్లే కాదు, ఫిమేల్ జడ్జిలు కూడా వాడేయడం చూస్తూనే వున్నాం.!
దురదృష్టమేంటంటే, ఆ ఎర్రి పప్ప అనే బూతుని రాజకీయ నాయకులు కూడా వాడేస్తున్నారు. అందులో, మహిళా నాయకులు ముందుంటున్నారు.
ఒకామె అయితే, ఆ ‘ఎర్రి పప్ప’కి బ్రాండ్ అంబాసిడర్. అంతలా వాడేస్తుంటుందామె. పైగా, కీలక పదవిలో కూడా వుందామె.
Political Konda Erripappa.. కొత్త అర్థం చెప్పిన అమాత్యులు..
మంత్రులంటే ఎలా వుండాలి.? చాలా చాలా హుందాగా వుండాలి.? ఓ రైతు, తన కష్టం గురించి చెప్పుకునేందుకు మంత్రి దగ్గరకు వస్తే, ‘ఎర్రి పప్ప’ అంటూ కసురుకున్నారాయన.
బూతులు మాట్లాడటమే కొందరు రాజకీయ నాయకులకు భవిష్యత్తు అయిపోయిందిప్పుడు.!
ఎవరెంతలా బూతులు తిడితే, వాళ్ళకి అంత గొప్ప పదవులు.!
ఆకాశంలో సగం.. అన్నింటా సగం.! ఔను, మహిళా నేతలూ పురుష నేతలతో పోటీగా బూతులు తిడుతున్నారు.
సిగ్గు పడాల్సింది సమాజమే ఇక్కడ.!
రాజకీయ నాయకులు మాత్రం నానాటికీ దిగజారిపోతున్నారు.
ఎర్రి పప్పలట.. కొండెర్రి పప్పలట.! నవ్విపోదురుగాక ఈ రాజకీయ నాయకులకేటి సిగ్గు.?
ముందు ముందు బూతు బాషని అధికార భాషగా మార్చినా మార్చేస్తారు.!
Mudra369
ఛీ.. వీడా మనకు మంత్రి.? అని జనం ఛీత్కరించుకునే పరిస్థితి వచ్చేసరికి, ‘ఎర్రి పప్ప’కి కొత్త అర్థం చెప్పాడాయన.!
ఎర్రి పప్ప అంటే, బుజ్జి నాన్నా.. అని అర్థమట.! కొన్నాళ్ళ క్రితం ఓ మంత్రిగారు (ఇప్పుడు మాజీ అయ్యాడు లెండి) ‘నీ యమ్మ మొగుడు’ అంటూ విరుచుకుపడిపోయాడు రాజకీయ ప్రత్యర్థుల మీద.
అమ్మ మొగుడి భాష.!
‘నీ యమ్మ మొగుడు.. అంటే, మీ నాన్న అని అర్థం. వాడుక భాషే అది.. ఏం, మీరు అలా అనలేదా ఎప్పుడూ.?’ అంటూ కవరింగ్ ఇచ్చాడా మంత్రి.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
బహుశా వాళ్ళ ఇంట్లో, ‘మీ నాన్నగారు ఏరీ.? అనడానికి, నీ యమ్మ మొగుడు ఎక్కడ.?’ అని అడుగుతారేమో.! బంధువుల్లోనూ ఇదే గౌరవం ఆయనగారికి వుందేమో.!
కొత్త భాష.! కొత్త నిఘంటువు.! కొత్త రాజ్యంగం.! ఔను, రంకు నేర్చిన రాజకీయం.. బొంకడంలో వింతేముంది.?
చివరగా.. రాయడానికి వీల్లేని భాషలో నాయకులు మాట్లాడుతున్నారు.! వాటి గురించి మాట్లాడుకోవడం అత్యంత దురదృష్టకరం.
కానీ, సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో వున్నవాళ్ళు.. సమాజానికి ఎంత చేటు చేస్తున్నారో చర్చించుకోకపోతే ఎలా.?