Table of Contents
Political Thaakattu Lorry Cleaner.. ముందుగా ఓ కథ చెప్పుకుందాం.! ఓ వ్యక్తి ఓ లారీకి యజమాని.! తన లారీ నిర్వహణ నిమిత్తం ఓ క్లీనర్‌ని నియమించుకున్నాడు. నెల నెలా వేతనం కూడా ఇస్తున్నాడు.!
సదరు క్లీనర్ కొన్నాళ్ళకి, ఆ లారీ తనదేనని భావించడం మొదలు పెట్టాడు. మాట్లాడుకున్నది ఐదేళ్ళ కూలీకి మాత్రమే.. అని తెలిసీ, తప్పుడు ఆలోచన చేశాడు.!
ఆ లారీని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేశాడు.! ఏం, లారీని తాకట్టు పెడితే తప్పేంటి.? అంటూ, తిరిగి యజమాని మీద గుస్సా అయ్యాడు.!
అసలు విషయంలోకి వస్తే..
ఇక్కడో ప్రజా ప్రతినిథి, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడితే తప్పేంటి.? అని అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు. అందుకే, రాజకీయ నాయకులకు ఈ మధ్య బుర్ర లేకుండా పోతోందని అనేది.!
ప్రజా ప్రతినిథి అంటే, ప్రజా సేవకులని అర్థం.! రాజులు, రాజ్యాలూ లేవిక్కడ.! ఇది ప్రజాస్వామ్యం. ప్రజల ప్రతినిథి అంటే, ప్రజల ఆస్తుల్ని అమ్మేయడమో, తాకట్టు పెట్టడమో చెయ్యకూడదు.!
ప్రభుత్వ ఆస్తులంటే, ప్రజల ఆస్తులే కదా.! మరి, ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వాలు అమ్మేయడమేంటి.?
గొప్ప గొప్ప పేర్లు పెడుతున్నారు సుమీ..
పెట్టుబడుల ఉప సంహరణ అట.. ఇంకోటేదో పేరట.! ఎవడబ్బ సొమ్మనీ.. అని జనం నిలదీస్తే, ప్రభుత్వాలు నడిపేటోళ్ళు ఏమైపోతారు.?
సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా.. అభివృద్ధి చేస్తున్నాం కదా.. ప్రభుత్వ ఆస్తుల్ని ఆమ్మేసి, ఆ సొమ్ములు మీకే ఇస్తున్నాం కదా.. అని బుకాయింపులొకటి.!
ఎవడు అడిగాడు సంక్షేమం.? అసలు, అభివృద్ధి ఎలా చేయాలి.? అభివృద్ధి ఫలాల్ని కదా, సంక్షేమం రూపంలో ప్రజలకు అందించాల్సింది.!
ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం.. సంక్షేమం ముసుగులో జనాన్ని మభ్యపెట్టి, రాజకీయ నాయకులు కోట్లు.. వందల కోట్లు, వేల కోట్లు.. లక్షల కోట్లు గడించడం.! ఇదీ నేటి రాజకీయం.!
Political Thaakattu Lorry Cleaner.. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
సిగ్గూ ఎగ్గూ లేనోడే రాజకీయ నాయకుడన్నది వెనకటికి చాలామంది చెప్పిన మాట.! ఒకప్పుడు ప్రజల్లో చైతన్యం వుండేది. ఇప్పుడా చైతన్యం చచ్చిపోయింది.
రాజకీయ నాయకుడు ఖరీదైన కార్లలో తిరుగుతూ, లగ్జరియస్ జీవితం గడుపుతున్నాడంటే.. అది తన జీవితాన్ని లాగేసుకోవడం వల్లేనని ఓటర్లు తెలుసుకోలేకపోతున్నారు.
Also Read: బాబు ఇచ్చాడా? జగన్ ఇస్తున్నాడా? నిజమెవరైనా చెప్పగలరా?
తాకట్టు.. కనికట్టు.! ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయడం.. ఆపై బుకాయించడం.! ఇదేం రాజకీయం.? ఇదేం పరిపాలన.? సిగ్గుండాలి కదా కాస్తయినా.?
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. పాలకులు కేవలం సేవకులు మాత్రమే.! ‘క్లీనర్’గా వచ్చే పాలకులకి, ప్రజల ఆస్తుల్ని విక్రయించే హక్కు లేదు.!
చివరగా.. లారీ – క్లీనర్ పోలిక, ఓ నెటిజన్ ఆవేదన నుంచి పుట్టుకొచ్చింది.