Pooja Hegde Beast Row.. అలా ఎందుకు చేశావ్.? పూజా హెగ్దే గురించి సర్వత్రా ఎందుకు ఈ చర్చ జరుగుతోంది.? ‘బీస్ట్’ సినిమా విషయంలో పూజా హెగ్దేపై ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి.?
విజయ్ (Thalapathy Vijay), పూజా హెగ్దే జంటగా ‘బీస్ట్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. తమిళంలో సినిమా పెద్ద హిట్టేనంటూ ప్రచారం ఓ పక్క విజయ్ అభిమానుల నుంచి జరుగుతోంది.
ఇంకోపక్క, ‘బీస్ట్’ నిర్మాతలు, పూజా హెగ్దేకి అల్టిమేటం జారీ చేశారట.. ‘అనవసర ఖర్చులు చేశావ్.. బిల్లు తడిసి మోపెడైంది.. తిరిగిచ్చెయ్..’ అని డిమాండ్ చేస్తూ.!
పూజా హెగ్దే అంటే ‘డిపిప్లిన్డ్ యాక్ట్రెస్’ అనే ఇమేజ్ వుంది. తెలుగులో ఇంతవరకు పూజా హెగ్దేకి సంబంధించి ‘అనవపర ఖర్చులు’ అన్న ప్రస్తావనే రాలేదు.
బుట్టబొమ్మా.? ఎందుకిలా చేశావ్.?
ఏమో, తెరవెనుకాల ఆమెతో ఇబ్బందులున్నాయేమో.. కానీ, బహిరంగంగా ఎవరూ పూజా హెగ్దేని ఇంతవరకూ తెలుగు సినీ పరిశ్రమలో విమర్శించింది లేదు.
ఎక్కడ తేడా కొట్టిందోగానీ, పూజా హగ్దేకి మాత్రం తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు బోల్డంత నెగెటివిటీ షురూ అయ్యింది.
నిజానికి, విజయ్ హీరోగా సినిమా అనగానే పూజా హెగ్దే చాలా ఎక్సైట్మెంట్‌కి గురయ్యింది. కానీ, తీరా సినిమాలో అసలు పూజా హెగ్దే ఎందుకు నటించింది.? అన్న ప్రశ్న ‘బీస్ట్’ చూశాక చాలామంది నుంచి దూసుకొచ్చింది.

నిజమే, పూజా హెగ్దేకి ‘బీస్ట్’ (Beast Film) సినిమాలో దక్కిన ప్రాధాన్యత (పాత్ర పరంగా) చాలా చాలా తక్కువ. పాటల్లో తప్పితే, కాస్ట్యూమ్స్ పరంగా కూడా ఆమె కోసం పెద్దగా ఖర్చు చేసిందేమీ లేదు.
Pooja Hegde Beast Row.. ఇక్కడైతే మంచి అమ్మాయే.!
మరి, లగ్జరీస్ విషయంలో ఎక్కడ, ఎందుకు పూజా హెగ్దే (Pooja Hegde) నిర్మాతల్ని ఇబ్బంది పెట్టినట్లు.? లక్షల్లో చెల్లించాలంటూ నిర్మాణ సంస్థ ఎందుకు పూజా హగ్దేకి అల్టిమేటం జారీ చేసినట్లు.?
Also Read: యాడున్నవ్ సుశాంత్.! ఎందుకంత తొందరగా వెళ్ళిపోయినవ్.!
పూజా హెగ్దే ఈ విషయమై సమాధానమిస్తుందో లేదోగానీ, ‘అబ్బే, ఆమె అలాంటిది కాదు..’ అని తెలుగు సినీ పరిశ్రమలో ఆమెతో పని చేసిన చాలామంది సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారట. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.!
ఎంతగా పూజా హెగ్దే ఇబ్బంది పెట్టి వుండకపోతే, ఆమెకి ఇంతలా ‘బీస్ట్’ (Beast Movie) మేకర్స్ అల్టిమేటం జారీ చేస్తారన్నదీ ఆలోచించాల్సిన విషయమే కదా.?