ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తే పబ్లిసిటీ పొందవచ్చునని కొందరు అనుకుంటారు. పూజా హెగ్దేకి అలాంటి అవసరం ఏమన్నా వుందా.? ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ పొజిషన్‌కి చాలా చాలా దగ్గరలో వుంది పూజా హెగ్దే (Pooja Hegde Hot). 2020 సంక్రాంతికి చాలా పెద్ద హిట్ కొట్టేసింది.
చేతిలో చాలా చాలా పెద్ద సినిమాలూ వున్నాయి. మరెందుకు సౌత్ సినీ జనాలు, ఆడియన్స్ మీద ఈ అందాల భామ సెటైర్లు వేసిందట.? తన బొడ్డు మీద సౌత్ జనాలకి ‘అబ్సెషన్’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఏదో సరదాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె అలా అనేసి వుండొచ్చు.
Also Read: మేడమ్ పూజా హెగ్దే.. లక్కూ.. కిక్కూ..!
కానీ, దాన్ని కవర్ చేసుకుంటూ, ‘నా ఉద్దేశ్యం అది కాదు.. తెలుగు సినీ పరిశ్రమ నాకు ప్రాణ సమానం..’ అంటూ పూజా హెగ్దే వివరణ ఇచ్చాక, వివాదం మరింత ముదిరింది. ‘ముందే ఆ జ్ఞానం వుండాలి కదా..’ అంటూ ఆమెను (Pooja Hegde Controversial Comments On Tollywood) తెగ ట్రోల్ చేసేస్తున్నారు సౌత్ ఆడియన్స్.
తెలుగు సినీ పరిశ్రమ నిన్ను స్టార్‌ని చేసింది.. తెలుగు సినిమాకి నువ్వు వెన్నుపోటు పొడిచావ్.. అనేస్తున్నారు సినీ ప్రియులు. హీరోయిన్లను డైరెక్టర్ తెరపై అందంగా చూపిస్తాడు.. ఆ తర్వాత ఎలా ఆమెను స్క్రీన్‌పై చూడాలన్నది ఆడియన్స్ వంతు.
‘నన్ను ఇలా చూడండి.. నన్ను ఇలా చూస్తున్నారు..’ అని స్టేట్‌మెంట్లు పాస్ చేసేస్తే ఎలా.? ‘నువ్వసలు స్క్రీన్ మీద ఎక్స్‌పోజింగ్ చేయొద్దు..’ అని ఎవరన్నా డిమాండ్ చేస్తే, ఆదేశిస్తే.. ఆమె ఊరుకుంటుందా.!
చూపించే ఆమెకే అలా వుంటే, టిక్కెట్ కొనుక్కుని చూసే ఆడియన్స్‌కి ఇంకెలా వుంటుందట.? అని సగటు సినీ ప్రేక్షకుడు నిలదీసేస్తున్నాడు.
‘ఏదో సరదాకి..’ అని ఆమె (Pooja Hegde Hot) లైట్ తీసుకోవచ్చుగాక. వివాదం మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. అయినా, ఈ టైంలో ఈ వివాదాలు ఆమెకు అవసరమా.?
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor), ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) సినిమాలతో టాలీవుడ్ టాప్ ఛెయిర్‌ని అధిరోహించబోయే ఆమె, ఈ తరహా వ్యాఖ్యలతో తన స్థాయిని ఎందుకు తగ్గించేసుకుందో ఏమో.