Pooja Hegde Mrunal Thakur.. అరరె.! పూజా హెగ్దే ఔట్ అయిపోయిందే.! ఆ స్థానంలోకి మృనాల్ ఠాకూర్ వచ్చి చేరిందే.! కానీ, ఎందుకంట.?
రౌడీ హీరో విజయ్ దేవరకొండతో దర్శకుడు పరశురామ్ (Director Parasuram) తెరకెక్కించనున్న సినిమా కోసం తొలుత పూజా హెగ్దే పేరు ప్రచారంలోకి వచ్చింది.
పూజా హెగ్దేతో (Pooja Hegde) ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కోసం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తహతహలాడాడంటూ గుసగుసలు వినిపించాయి.
Pooja Hegde Mrunal Thakur.. పూజా హెగ్దే హిట్ వికెట్.?
అసలేమయ్యింది.? పూజా హెగ్దే (Pooja Hegde) ఎందుకు ఔట్ అయిపోయింది.? ఆ స్థానంలో మృనాల్ ఠాకూర్ పేరు ఎందుకు వచ్చింది.?
మృనాల్ ఠాకూర్‌తో (Mrunal Thakur) పోల్చితే, తెలుగులో పూజా హెగ్దే పాపులర్ హీరోయిన్. నెంబర్ వన్ హీరోయిన్ అని కూడా అనేయొచ్చు.

అయితే, విజయ్ దేవరకొండతో సినిమాకిగాను, పూజా హెగ్దే అనూహ్యంగా హయ్యస్ట్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఆ కారణంగానే ఆమెను పక్కన పెట్టారట.!
ఇదీ ప్రచారంలో వున్న ఓ గాసిప్ సారాంశం. కానీ, అదంతా హంబక్.. అనేవారూ లేకపోలేదు.
మృనాల్ ఠాకూర్‌తో కంఫర్ట్ అదీ..
పూజా హెగ్దేతో పోల్చితే మృనాల్ ఠాకూర్.. తక్కువ రెమ్యునరేషన్‌కే వచ్చేస్తుంది. అదొక అడ్వాంటేజ్.! ఎలా చూసుకున్నా, పూజా హెగ్దే బిజీ హీరోయిన్.
సో, డేట్స్ అడ్జస్ట్ చేయడం పూజా హెగ్దేకి కష్టమైన పనే. అదే మృనాల్ ఠాకూర్‌తో అయితే ఆ సమస్య వుండదు. పైగా, మృనాల్ క్రేజ్ కూడా ఇప్పుడు మామూలుగా లేదు మరి.!

అంతేనా.? ఇంకేమన్నా వేరే కారణాలు.. గ్లామరూ.. అలాంటివి కూడా కీలక పాత్ర పోషించాయా.? ఏమో మరి.! సినిమా అంటేనే.. సవాలక్ష ఈక్వేషన్లుంటాయ్.! బోల్డన్ని సెంటిమెంట్లూ వుంటాయ్.
Also Read: అప్పుడు కైరా అద్వానీ.! ఇప్పుడేమో తమన్నా.!
ఎక్కడో ఏ ఈక్వేషనో బెడిసి కొట్టి.. విజయ్ దేవరకొండ – పూజా హెగ్దే కాంబినేషన్ కాస్తా విజయ్ దేవరకొండ – మృనాల్ ఠాకూర్ కాంబినేషన్‌గా మారి వుండొచ్చుగాక.!